
హైదరాబాద్: టీమిండియాపై అనుచితంగా ట్వీట్ చేసినందుకు గాను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను భారత క్రికెట్ అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 200 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ, 14వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన తన మూడో ఓవర్‌లో ఇంగ్లండ్‌ను శాసించాడు.
కుల్దీప్ యాదవ్(5/24) బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో లోకేశ్ రాహుల్ (101; 54 బంతుల్లో 10 ఫోర్లు, 5సిక్సర్లు) అద్భుత సెంచరీతో నాటౌట్‌గా రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపిస్తూ... కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో పోలిస్తే పటిష్టంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.
దీంతో వాన్ ట్వీట్‌పై భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అంతేకాదు ట్విట్టర్‌లో ఇంగ్లాండ్ జట్టుతో పోలిస్తే ఐర్లాండ్ జట్టు అత్యుత్తమంగా ఉందంటూ జోకులు పేల్చారు. దీంతో పాటు గత నెలలో స్కాట్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలైన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేశారు.