మంట పెట్టిన వర్షం: రూఫ్ కవర్ ఉండీ దండగ - ఆ మాత్రం తెలియదా?: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్లక్ష్యం

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ను వర్షం వెంటాడుతూనే ఉంది. తొలి రోజు నుంచీ దెబ్బకొడుతూనే వస్తోంది. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ వర్షం బారిన పడి, రద్దయింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే పోరు ఫలితం కూడా తేలలేదు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లాండ్ సైతం తన కంటే చిన్న జట్టు చేతిలో పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది వర్షం బెడద వల్ల. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిందా టైటిల్ హాట్ ఫేవరెట్. ఇలా ప్రతి రోజూ టీ20 ప్రపంచకప్‌కు వర్షం ఆటంకం కలిగిస్తూనే వస్తోంది.

వదలని వాన..
ఇవ్వాళ కూడా అది వదల్లేదు. ఐర్లాండ్ - ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అడ్డుపడింది. ఐర్లాండ్‌కు దూకుడుకు అడ్డుకట్ట వేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ను ఓడించి ఫుల్ జోష్ మీద ఉన్న జట్టు ఐర్లాండ్. ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టి కరిపించడానికి ఉవ్విళ్లూరుతోన్న తరుణంలో భారీ వర్షం కురిసింది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ముంచెత్తింది. సమయం గడుస్తున్నప్పటికీ తెరపినివ్వలేదు. ఫలితంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది.
ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ కూడా
ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మ్యాచ్ సైతం వర్షం బారి నుంచి తప్పించుకోలేక పోయింది. మెల్‌బోర్న్‌లో ఈ ఉదయం ఆరంభమైన వర్షం రాత్రి వరకూ కురుస్తూనే ఉంది. మధ్యలో కొంత మేర తెరిపినిచ్చినప్పటికీ- మ్యాచ్‌ను నిర్వహించడానికి ఆ సమయం సరిపోలేదు. అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. నీళ్లను తోడేయడానికి గ్రౌండ్ స్టాఫ్ ప్రత్యేక పరికరాలను అందుబాటులో ఉంచుకున్నా వాటి అవసరం రాలేదు. ఆగి ఆగి వర్షం పడటంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది.

రూఫ్ ఉన్నా..
నిజానికి- ఇవ్వాళ్టి ఈ రెండు మ్యాచ్‌లకూ ఆతిథ్యాన్ని ఇచ్చిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌కు రూఫ్ కవర్ సౌకర్యం ఉంది. ఒక్క చినుకు కూడా గ్రౌండ్‌పై పడకుండా పూర్తిగా కప్పేయగల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రూఫ్ కవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. కారణం ఏమిటో తెలియట్లేదు గానీ- వర్షం పడుతుందని తెలిసినప్పటికీ దీన్ని వినియోగించలేదు. అసలు అలాంటి సౌకర్యం ఉందనే విషయాన్ని మరిచిపోయినట్లు వ్యవహరించింది.

మండిపాటు..
క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ ఈ నిర్లక్ష్య వైఖరి పట్ల విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహించడంలో చేతులెత్తేసిందని, దీన్ని గంగపాలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. ఫస్ట్ అటాక్- ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైఖెల్ వాగన్ నుంచి వెలువడింది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోందని, అయినా కనీస జాగ్రత్తలను తీసుకోలేదని మండిపడ్డారాయన. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌కు రూఫ్ కవర్ సౌకర్యం ఉన్నా ఎందుకు వినియోగించలేదని నిలదీశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications