Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ఆల్ రౌండర్ ను ఏకిపారేసిన లెజెండరీ ప్లేయర్

ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడకపోవడం ఇప్పుడు అనేక ప్రశ్నలు, అనుమానాలకు తావిచ్చింది. హాట్ డిబేట్ కు తెర తీసింది. ప్లేఆఫ్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ కు డుమ్మా కొట్టడం పట్ల విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మేనేజ్మెంట్ వ్యూహాత్మకంగా అతన్ని తప్పించిందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

రవీంద్ర జడేజా ఆడకపోవడం పట్ల ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ మైఖెల్ వాన్ ఈ అనుమానాలు లేవనెత్తారు. అతను ఎందుకు దూరమయ్యాడని ప్రశ్నించారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నాడని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పినప్పటికీ, దీనికి వేరే కారణం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది సమస్యే కాదని తేల్చి చెప్పారు.

Michael Vaughan questioned this Team India allrounder Absence Shakes RR as Critics Mid-Overs Bowling

"రవీంద్ర జడేజాకు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. చిన్నపాటి సమస్యకు అతను మ్యాచ్ నుంచి తప్పుకోడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా పనిభార నిర్వహణ పేరు చెప్పడం వింత. అతనికి ఏదో సమస్య ఉందనేది స్పష్టం. అతను మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నా.." అని పేర్కొన్నారు. బ్యాటింగ్ పతనం కాకుండా జడేజా అడ్డుకునేవాడని, మిచెల్ స్టార్క్‌పై భారీ షాట్లతో ఎదురుదాడికి దిగేవాడని తేల్చి చెప్పారు. ఎడమచేతి స్పిన్ బౌలర్ కావడం వల్ల పరుగులను కూడా కట్టడి చేసేవాడని వివరించారు.

రియాన్ పరాగ్ కెప్టెన్సీని కూడా మైఖేల్ వాన్ తప్పుబట్టారు. ఢిల్లీ ఛేజింగ్‌లో 18వ ఓవర్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ డొనోవన్ ఫెరీరాను బౌలింగ్‌కు దించడాన్ని వాన్ విమర్శించారు. "డొనోవన్ ఫెరీరాను బౌలింగ్ చేయించిన వ్యూహాత్మక నిర్ణయాన్ని నేను ప్రశ్నించాల్సిందే. ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారని భావించి పార్ట్‌టైమ్ ఆఫ్-స్పిన్నర్‌ను ప్రవేశపెట్టారా? అది గొప్ప నిర్ణయం కాదు, అనవసరం.. అని వాన్ అన్నారు.

Story first published: Monday, May 18, 2026, 13:07 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+