దెబ్బకు మైఖేల్ వాన్ సెట్టయిపోయాడు.. ప్రస్తుత టీమిండియా టీ20, వన్డే ప్రపంచకప్‌లు గెలవొచ్చని కితాబు

తొలుత ఇండియా బౌలర్లను తక్కువ అంచనా వేస్తూ.. ఇంగ్లాండ్ బ్యాటర్లు 400ఈజీగా కొడతారని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. నిన్నటి ఇండియా విజయం దెబ్బకు సెట్టయిపోయాడు. తాజాగా ఇండియాను పొగుడుతున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు (టీ20, వన్డే టీంలు) అన్ని ఐసీసీ టోర్నమెంట్‌లను గెలవాలని వాన్ సూచించాడు. వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ తదితర ఐసీసీ ఈవెంట్లను గెలవడానికి అవసరమయ్యే నిఖార్సైన ప్లేయర్లు ఇండియా జట్టులో ప్రస్తుతం ఉన్నారని, ఇది ఇండియాకు మంచి తరుణమని వాన్ అభిప్రాయపడ్డాడు. ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 10వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మైఖేల్ వాన్ ఈ కామెంట్లు చేశాడు.

ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించేలా ఇండియా ఉంది
ప్రస్తుతం చూస్తుంటే అన్ని పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రత్యర్థిని అయినా ఓడించగల ఆటగాళ్లు టీం ఇండియాకు ఉన్నందున.. ఇండియా ఐసీసీ టోర్నమెంట్‌లను ఈ తరుణంలో గెలవాలని వాన్ అన్నాడు. 'వన్డే ప్రపంచకప్ కోసం ఇంకా ఏడాదిన్నర టైం ఉంది. అప్పటిలోపు పరిస్థితులు భిన్నంగా మారే అవకాశాలుంటాయి. భారత ప్లేయర్లు వైట్-బాల్ క్రికెట్‌లో ఇప్పుడు సరైన ఊపును పొందారు. ఈ ఊపును వారు ఇప్పుడు అందుకోవడం సరైంది. ఐసీసీ టోర్నీలు ముందున్న తరుణంలో ఇలాంటి జట్టు, ప్లేయర్లు ఉండడం ఇండియాకు కలిసొస్తుంది.' అన్నాడు.

చాలా ఏళ్లుగా ఐసీసీ టోర్నీలు భారత్ గెలవలేదు
'ఇంగ్లాండ్‌తో టీ20సిరీస్‌లో ఇండియా టీం ఆడిన పద్ధతి నేను బాగా చూశా. వాళ్లు చాలా దూకుడుగా ఆడారు. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లో వారి దూకుడు బాగుంది. ఇండియాకు అవకాశాలు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి టైంలోనే ప్రత్యర్థి జట్లను దెబ్బతీయాలి. ఇంగ్లాండ్ ప్రస్తుతం అత్యుత్తమ జట్టు. అలాంటి జట్టును ఇంత భారీ తేడాతో ఓడించడంతో ఇండియాకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం లభిస్తుంది. నేను చెప్పేదేంటంటే.. భారత వన్డే జట్టు చాలా కాలంగా ఐసీసీ సిరీస్‌లు గెలవలేదు. భారత్ ముందు మంచి అవకాశాలున్నాయి. టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ లాంటివి ఇండియా ఒడిసిపట్టాలి' అని వాన్ క్రిక్‌బజ్‌తో చెప్పాడు.

2013నుంచి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షే
ఇకపోతే ఇండియా అత్యుత్తమ జట్లలో ఒకటి అయినప్పటికీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నమెంట్‌ను గెలుచుకోలేకపోయింది. చివరిసారిగా 2011లో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్ భారత్ గెలిచింది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో.. మళ్లీ ఐసీసీ టోర్నీలను గెలుచుకునేందుకు ఇండియాకు సదావకాశం వచ్చింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20వరల్డ్ కప్ ద్వారా ఐసీసీ టోర్నీ గెలవడానికి ఇండియాకు తొలి అవకాశం లభించనుంది. వచ్చే ఏడాది చివర్లో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగబోతుంది. స్వదేశంలో జరగబోతుండడం భారత్‌కు మరింత మంచి అవకాశమనే చెప్పాలి.

భారత్ టైటిల్ ఫేవరేట్.. నో డౌట్
ఇక టీ20ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌లలో ఒక జట్టుగా బరిలోకి దిగుతుందని వాన్ చెప్పాడు. వాన్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ నేపథ్యంలో రూపొందిన భారత టీ20 జట్టు ప్రపంచంలోని అన్ని పరిస్థితులలోనూ దూసుకుపోవాలి. వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ మాత్రమే కాదు.. మరి కొన్ని నెలల్లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా గెలవడానికి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్ జట్టు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. టీంలో కచ్చితంగా టైటిల్ అందుకునేందుకు కావాల్సిన నైపుణ్యవంతమైన ప్లేయర్లు ఉన్నారు.' అని వాన్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications