Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా కోచ్‌గా ఆసీస్ దిగ్గజం?

టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలిచిన అనంతరం టీమిండియా టీ20 క్రికెట్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే పేలవమైన ఫామ్ కారణంగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు. దాదాపు రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. బెల్ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ భారత టీ20 జట్టు భవిష్యత్తుపై, కోచింగ్ మార్పులపై ఓ ఆసక్తికరమైన అంచనాను వ్యక్తం చేశాడు.

అజింక్యా రహానే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన మైఖేల్ వాన్.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడంపై స్పందిస్తూ సరికొత్త చర్చకు తెరలేపాడు. "శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడనే వార్త వినగానే.. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ టీమిండియాకు కొత్త కోచ్ అవుతాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే శ్రేయస్, పాంటింగ్‌ల జోడీ ఎప్పుడూ కలిసే కనిపిస్తుంది" అని మైఖేల్ వాన్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని మైఖేల్ వాన్ గుర్తుచేశాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కలిసి పనిచేసిన ఈ జోడీ.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో కూడా కీలక పాత్రలు పోషిస్తోంది. పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ కెప్టెన్‌గా.. పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Michael Vaughan Makes Bold Prediction on India Next Coach Says Gautam Gambhir to be Replaced

భారత క్రికెట్లో ఉన్న ఆటగాళ్ల ప్రతిభను మైఖేల్ వాన్ ఎంతగానో ప్రశంసించాడు. ఇప్పుడే టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలిపించిన కెప్టెన్‌ను కూడా జట్టు నుంచి తొలగించగల సత్తా, ధైర్యం ప్రపంచంలో ఒక్క భారత్ క్రికెట్‌కు మాత్రమే సాధ్యమని.. మరే ఇతర దేశంలో ఇలాంటి నిర్ణయాలు ఊహించలేమని అన్నాడు. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై కూడా మైఖేల్ వాన్ జోస్యం చెప్పాడు. తదుపరి టీ20 ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉందని.. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుపై భారత్‌దే పైచేయి అవుతుందని స్పష్టం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అయిన భారత్‌ను ఢీకొట్టాలంటే ఇంగ్లాండ్ అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, అయితే అంతకంటే ముందు ఐర్లాండ్ టూర్‌ను విజయవంతంగా ముగించడంపై భారత్ దృష్టి పెట్టాలని మైఖేల్ వాన్ సూచించాడు.

Story first published: Sunday, June 28, 2026, 14:29 [IST]
Other articles published on Jun 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+