
అది స్మార్ట్ క్రికెట్:
ఆదివారం అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో చెన్నై విజయం సాధించింది. ఈ విజయంలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. ధోనీ తన చాకచక్యంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో మార్పులు చేసి జట్టుకు అద్నుత విజయాన్ని అందించాడు. మహీ వ్యూహాలపై తాజాగా మైఖేల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... 'చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్‌లో సరైన కాంబినేషన్లు కుదిరాయి. పిచ్‌ని బట్టి, ఎవరు బౌలింగ్ చేస్తున్నారో బట్టి మహీ తన వ్యూహాలను అమలుచేస్తుంటాడు. గ్లెన్ మాక్స్వెల్ మళ్లీ బౌలింగ్ చేయబోతున్నాడని గ్రహించిన మహీ.. ఓ రైట్ హ్యాండ్ బ్యాటర్‌ను రంగంలోకి దింపాడు. అది స్మార్ట్ క్రికెట్' అని ప్రశంసించాడు.

మహీ లాంటి బుర్ర జట్టుకు ఎంతో అవసరం:
'టీ20 ప్రపంచకప్ 2021 కోసం టీమిండియా అత్యుత్తమ టీ20 సారథిని మెంటార్‌గా నియమించుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారందిరిని ఒకటే అడగలనుకుంటున్నా.. ప్రపంచకప్‌లో భారత్ మహీ సేవలను ఎందుకు వినియోగించుకోకూడదు?. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పది. ధోనీ లాంటి వ్యక్తి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండాలి. అతడి లాంటి బుర్ర జట్టుకు ఎంతో అవసరం. మ్యాచ్‌లో పరిస్థితులను అంచనా వేయడంలో అతడు మాస్టర్. ట్రైనింగ్ సమయంలో, ఆట సమయంలో డగౌట్లో మహీ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మహీ నిర్ణయాలు ఎప్పుడూ 90-95 శాతం సక్సెస్ అవుతుంటాయి' అని మైఖేల్ వాన్ పేర్కొన్నాడు.

మెంటార్ సింగ్ ధోనీ:
తాజాగా పార్థివ్ పటేల్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీని 'మెంటార్ సింగ్ ధోనీ' అని ఎందుకు అనాలో ఓ కారణం ఉంది. మహీ ఎంతో కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటాడు. పిచ్‌లను అంచనా వేయడంలో దిట్ట. బౌలర్ల నుంచి సరైన ప్రదర్శన ఎలా రాబట్టాలో అతడికి బాగా తెలుసు. డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్ లేదా దీపక్ చహర్ ఇలా ఎవర్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో ధోనీకి తెలుసు. ఆటగాళ్లు అతడిని బాగా నమ్ముతారు. ధోనీతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఎందుకంటే.. మహీకి అంత మంచి అనుభవం ఉంది. అంతకు మించి గొప్ప విజయాలు ఉన్నాయి' అని అన్నాడు.

మరో ట్రోఫీ అందించేలా:
ఎంఎస్ ధోనీ 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. సెమీ ఫైనల్స్‌లో రవీంద్ర జడేజా (77)తో కలిసి ధోనీ 50) రాణించినా.. చివరకు భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఏడాదికి పైగా విశ్రాంతి తీసుకున్న మహీ.. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది ఐపీఎల్లో ధోనీ నిరాశపర్చాడు. అయితే ప్రస్తుత సీజన్లో మాత్రం చెన్నై వరుస విజయాలతో దూసుకుపోతోంది. ధోనీ వ్యూహాలు చూస్తుంటే.. చెన్నైకి మరో ట్రోఫీ అందించేలా ఉన్నాడు. ఐపీఎల్ అనంతరం జరిగే టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీసేనకు కూడా కప్ అందించాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.