Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: కుల్దీప్ యాదవ్ ఇంతలా విఫలమవ్వడానికి అసలు కారణం అదే: మైకేల్ వాన్

Michael Vaughan feels Kuldeep Yadav struggling because of MS Dhonis absence

లండన్: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. గత రెండేళ్లుగా పేలవ ఫామ్‌తో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న కుల్దీప్.. ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అడపాదడపా వచ్చిన అవకాశంలో కనీసం స్థాయికి తగిన ప్రదర్శన కూడా కనబర్చలేకపోతున్నాడు. అయితే కుల్దీప్ ఇలా విఫలమవ్వడానికి అసలుకారణం చెప్పాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. టీమ్‌లో లేకపోవడమే కుల్దీప్ తడబాటుకి కారణమన్నాడు.

వైవిద్యం చూపిస్తేనే:

వైవిద్యం చూపిస్తేనే:

తాజాగా మైకేల్ వాన్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ... 'కుల్దీప్ యాదవ్‌ను చూస్తే.. అతడు బెటర్ అయ్యాడనిపించడం లేదు. బహుశా అదే స్థాయిలో బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్, అంతర్జాతీయ ఆటలో వైవిద్యం చూపిస్తేనే.. లెగ్ స్పిన్నర్‌గా రాణించగలం. కుల్దీప్ అదే వేగంతోనే బాల్ విసురుతున్నాడు. నెమ్మదిగానే గూగ్లీలు వేస్తున్నాడు. బ్యాట్స్‌మన్‌ వీడియోలు చూడడానికి ఈరోజుల్లో ఎన్నో వనరులు ఉన్నాయి. వారు బౌలర్ విసిరే బంతిని ఇట్టే కనిపెట్టేస్తారు. అందుకే వైవిద్యం ఉండాలి' అని అన్నాడు.

ధోనీ లేకపోవడం వల్లే:

ధోనీ లేకపోవడం వల్లే:

'ఎంఎస్ ధోనీ వికెట్ల వెనుక నుంచి అతనికి సహకరిస్తున్నప్పుడు.. కుల్దీప్ యాదవ్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసేవాడు. కానీ గత రెండేళ్ల నుంచి అతని బౌలింగ్‌లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అతను విసిరే స్లో గూగ్లీలు వర్క్‌వుట్ అవడం లేదు. సులువుగా అతని బౌలింగ్‌ని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు రీడ్ చేస్తున్నారు. మహీ లేకపోవడంతో అతని బౌలింగ్‌లో వైవిధ్యం దెబ్బతింది. ఇప్పుడు అతడు టచ్ కోల్పోయాడు' అని మైకేల్ వాన్ అసలు విషయం చెప్పాడు. మహీ అంతర్జాతీయ క్రికెట్‌కి గతేడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

విత్‌ ధోనీ.. వితౌట్‌ ధోనీ:

విత్‌ ధోనీ.. వితౌట్‌ ధోనీ:

శుక్రవారం జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు (10 ఓవర్లలో 84) ఇచ్చుకున్నాడు. తన తొలి 6 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఫరవాలేదనిపించిన కుల్దీప్‌.. తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 8, 17, 20, 7 (మొత్తం 52) చొప్పున పరుగులిచ్చి ఉసూరుమనిపించాడు. మ్యాచ్‌లో మొత్తం పది ఓవర్లు బౌల్ చేసిన కుల్దీప్ ఏకంగా 84 పరుగులు ఇవ్వడం గమనార్హం. రెండో వన్డే మ్యాచ్‌లో ఓటమి ఎదురవడంతో టీమిండియా అభిమానులు కొందరు అతడిపై ట్రోలింగ్‌ షురూ చేశారు. 'కుల్దీప్.. ఇక నీ సేవలు ఇక చాలు. బ్యాగ్‌ సర్దుకో' అని ఒకరు కామెంట్‌ చేయగా.. 'కుల్దీప్‌ పర్ఫామెన్స్‌ విత్‌ ధోనీ.. వితౌట్‌ ధోనీ' అని మరొకరు కామెంట్‌ చేశారు.

అత్యంత చెత్త రికార్డు :

అత్యంత చెత్త రికార్డు :

రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ పేరిట అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఎక్కువ సిక్సులు ఇచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ చైనామెన్ స్పిన్నర్ 10 ఓవర్ల స్పెల్‌లో ప్రత్యర్థి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు ఏకంగా 8 సిక్సులు బాదారు. ఇంతకుముందు ఈ రికార్డు మీడియం పేసర్ ఆర్ వినయ్ కుమార్ పేరున ఉంది. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వినయ్ బౌలింగ్‌లో కంగారు బ్యాట్స్‌మెన్లు ఏడు సిక్సర్లు కొట్టారు. నిన్నటి వన్డేలో కుల్దీప్ ఈ రికార్డును ఒక సిక్సర్ తేడాతో దాటేశాడు.

Story first published: Tuesday, March 30, 2021, 13:23 [IST]
Other articles published on Mar 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+