మేకతో సెల్ఫీ దిగి కోహ్లీతో పోలిక: మైకేల్ వాన్‌పై కోహ్లీ ఫ్యాన్స్ పైర్

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మంగళవారం 44వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు నాడు అతడు పోస్టు చేసిన ఓ సెల్ఫీపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా మైకేల్ వాన్ ఓ మేకతో సెల్ఫీ దిగి తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసి 'అందరికీ మార్నింగ్... విరాట్‌తో బర్త్ డే సెల్ఫీ' అంటూ కామెంట్ పెట్టాడు. మేకతో ఫోటో దిగి విరాట్ కోహ్లీతో ఫోటో అంటూ కామెంట్ పెడతావా? అంటూ కోహ్లీ అభిమానులు మైకేల్ వాన్‌పై మండిపడ్డారు.

వాన్ పోస్టు చేసిన సెల్ఫీ అర్ధం వేరే
నిజానికి మైకేల్ వాన్ పోస్టు చేసిన సెల్ఫీ అర్ధం వేరే ఉందని, అది తెలియకే అతడిపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారని క్రికెట్ విశ్లేషకులు తెలిపారు. GOAT అంటే Greatest of All Time అని ప్రస్తుతం విండిస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టించడంతో అతడిని GOAT అంటూ మాజీ క్రికెటర్లు అభివర్ణిస్తున్నారు.
మేకతో సెల్ఫీ దిగి ఆ విధంగా కామెంట్
ఇదే అర్ధం వచ్చే విధంగా మైకేల్ వాన్ కూడా మేకతో సెల్ఫీ దిగి ఆ విధంగా కామెంట్ పెట్టాడని చెబుతున్నారు. అంతేతప్ప కోహ్లీని కించపరచాలని కాదు అని అంటున్నారు. విండిస్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో కెప్టెన్ కోహ్లీ 420 పరుగులు చేశాడు. వెస్టిండిస్ జట్టుపై ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగులివే కావడం విశేషం.

ఆఖరి వన్డే నవంబర్ 1న
ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా.. టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications