
చాలెంజింగ్‌గా కనిపించినా:
తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి గురించి మైకెల్ స్లేటర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'రవిశాస్త్రి, విరాట్ కోహ్లీలను నేను చాలా దగ్గర్నుంచి చూశాను. ఒకరికొకరు చాలెంజింగ్‌గా కనిపించినా.. పని విషయంలో మాత్రం ఇరువురు పరస్పర నిర్ణయాలను గౌరవించుకుంటారు. కోహి ఏదైనా చెబితే దానిని శాస్త్రి ఓపికగా వింటాడు. కోహ్లీ విషయంలోనూ ఇదే జరగుతుంది. ఇద్దరు కలిసి సరైన నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇద్దరి నిర్ణయాల్లో కొన్నిసార్లు తప్పులు కనిపించినా.. సర్దుకుపోవడం గమనించాను' అని స్లేటర్ తెలిపాడు.

భారత క్రికెట్ టెంపోను మార్చారు:
'కామెంటరీ బాక్స్‌లో నేను రవిశాస్త్రిని చాలా దగ్గర్నుంచి చూశాను. నేను పని చేసిన అత్యుత్తమ కామెంటరీల్లో రవి ఒకడు. విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడు. రవిశాస్త్రి కూల్‌గా ఆలోచిస్తాడు. ఇద్దరిలో చాలా తేడాలున్నా.. అవన్నీ పక్కనపెట్టి కలిసి పనిచేయడం ద్వారా భారత క్రికెట్ టెంపోను మార్చివేశారు' అని మైకెల్ స్లేటర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో స్లేటర్ 74 టెస్టుల్లో, 42 వన్డే మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కుంబ్లే రాజీనామా:
2017లో భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత అతని స్థానంలో రవిశాస్త్రి వచ్చాడు. కుంబ్లే సలహాలు తనకు నచ్చేవి కావని కెప్టెన్ విరాట్ కోహ్లీ బాహటంగానే ప్రకటించాడు. మరోవైపు జంబో చాలా స్ట్రిక్ట్. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కుంబ్లే స్వయంగా తన పదవి నుండి తప్పుకున్నాడు. అప్పటికే టీం డైరెక్టర్ మంచి పేరుతెచ్చుకున్న శాస్త్రి.. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. పదవీకాలం ముగియగా.. ఈ ఏడాది ఆరంభంలో మరో రెండేళ్లకు పొడిగించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ వరకు శాస్త్రి ప్రధాన కోచ్ పదవిలో కొనసాగనున్నాడు.

మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది:
తాజాగా భారత మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా మాట్లాడుతూ... 'కోహ్లీకి అవసరమైన స్వేచ్ఛను శాస్త్రి ఇస్తారు. శాస్త్రి ఎలాంటి వ్యక్తో, ఆయన్నుంచి ఏం రాబట్టుకోవాలో కోహ్లీకి తెలుసు. శాస్త్రి గొప్పగా ప్రేరణనిస్తారు. కోహ్లీ కూడా జట్టును ముందుండి నడిపిస్తాడు. వీరిద్దరి మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది. అందుకే వారంత సన్నిహితంగా మెలుగుతారు. అయితే అన్ని అంశాల్లో వారు ఏకాభిప్రాయంతో ఉండరు. కొన్నింట్లో విభేదిస్తారు. అవతలి వారి అభిప్రాయాలను జాగ్రత్తగా విని ఒక పరిష్కారానికి వస్తారు. కోచ్ లేదా కెప్టెనే తుది నిర్ణయం తీసుకుంటారని అనుకోవద్దు. నా వరకైతే 50-50 భాగస్వామ్యం అవసరం' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












