Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BBL Final: కళ్లు చెదిరే క్యాచ్.. మునివేళ్లపై ఊపిరిబిగపట్టిన ఫ్యాన్స్! (Video)

బిగ్ బాష్ లీగ్ 13వ సీజన్ ముగిసింది. బ్రిస్బేన్ హీట్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో సిడ్నీ సిక్సర్స్‌పై 54 పరుగుల తేడాతో బ్రిస్బేన్ ఘన విజయం సాధించింది. తుది పోరు వన్‌సైడ్‌గా మారినా.. ఓ క్షణాన మాత్రం స్టేడియంలోని ప్రేక్షకులంతా ఊపిరి బిగపట్టారు. క్యాచ్ అందుకుంటాడా లేదా అనే ఉత్కంఠతో మునివేళ్లపై నిలబడ్డారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ ఎనిమిది వికెట్లకు 166 పరుగులు చేసింది. ఆదిలోనే ఓపెనర్ జిమ్మీ పీర్సన్ (4) ఔటైనప్పటికీ.. జోష్ బ్రౌన్ (53; 38 బంతుల్లో), కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (33; 32 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోరు పరుగుల వద్ద వీరిద్దరు వరుసగా పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెన్షా (40; 22 బంతుల్లో) , మాక్స్ బ్రెయింట్ (29; 19 బంతుల్లో) దూకుడుతూ పరుగులు సాధించారు. సిడ్నీ సిక్సర్లతో అబాట్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

Michael Neser takes brilliant catch in Big Bash League Final

ఛేదనలో సిడ్నీ సిక్సర్స్ 112 పరుగులకే ఆలౌటయ్యింది. ఏ దశలోనూ ఆ జట్టు పోరాటపటిమ చూపలేదు. బ్రిస్బేన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. జోష్ ఫిలిప్ (23; 22 బంతుల్లో), హెన్రిక్స్ (25; 27 బంతుల్లో) కాసేపు నిలబడటంతో సిడ్నీ 100 పరుగుల స్కోరును దాటింది. బ్రిస్బేన్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషిచాడు.

అయితే జేవియర్ బౌలింగ్‌లో సిడ్నీ ప్లేయర్ అబాట్ (16; 11 బంతుల్లో) భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది.బౌండరీలైన్‌లో ఉన్న మైకేల్ నీసర్ క్యాచ్ పట్టడానికి వేగంగా పరిగెత్తుతూ వచ్చాడు. కానీ బౌండరీ రోప్‌ను తాకే స్థితిలో క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే అప్రమత్తమై క్షణాల్లోనే బంతిని అవతలకు విసిరాడు. దాన్ని సమయస్ఫూర్తిగా పాల్ వాల్టెర్ అందుకోవడంతో ఇది సూపర్ క్యాచ్‌గా మారింది. ఇది ఔటా, నాటౌటా అని తేల్చడానికి థర్డ్ అంపైర్ చాలా సమయం తీసుకున్నాడు. మొత్తంగా ఔట్ అని ప్రకటించాడు.

Story first published: Wednesday, January 24, 2024, 19:36 [IST]
Other articles published on Jan 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+