For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అన్ని సిక్సర్లు బాదాలంటే.. 40 ఏళ్లు ఆడాల్సిందే'

Michael Holding described MS Dhoni as a maverick who would destroy anyone in front of him

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీపై వెస్టిండీస్‌ దిగ్గజం మైకెల్‌ హోల్డింగ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీ ఓ మహా వీరుడని పేర్కొన్నారు. మిడిలార్డర్‌లో మహీ ఆటను నియంత్రించాడే కానీ, విఫలం కాలేదన్నారు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఓటమి తర్వాత ధోనీ మైదానంలోకి దిగలేదు. ఇక ఆగస్టు 15న అందరినీ ఆశ్చర్యపరుస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ‌ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్‌ ధోనీ మాత్రమే.

40 ఏళ్లు ఆడాల్సిందే:

40 ఏళ్లు ఆడాల్సిందే:

తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా మైకెల్ ‌హోల్డింగ్‌ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ టీమిండియా కోసం వన్డేలు ఆడటం మొదలుపెట్టినప్పుడు జులపాల జుట్టుతో వీరుడిలా అనిపించాడు. అతను తన ముందు వచ్చినదాన్ని నాశనం చేయడానికి వచ్చిన వ్యక్తిలా కనిపించాడు. నిజానికి అతడదే చేశాడు. మహీ వన్డే కెరీర్‌లో 229 సిక్సర్లు బాదేశాడు. ఆ గణాంకాల గురించి ఆలోచిస్తుంటే.. అన్ని సిక్సర్లు బాదాలంటే ధోనీ కనీసం 40 ఏళ్లు ఆడి ఉండాలనుకోవాలి. కానీ అతడి స్వభావం అలాంటిది మరి' అని పేర్కొన్నారు.

ఆటగాళ్లను పిలిచి ఓపికతో మాట్లాడేవాడు:

ఆటగాళ్లను పిలిచి ఓపికతో మాట్లాడేవాడు:

'టాప్‌ ఆర్డర్లో ఎంఎస్ ధోనీ విరుచుకుపడేవాడు. మిడిలార్డర్‌కు వెళ్లాక నియంత్రణ కోల్పోవడం ఎప్పుడూ చూడలేదు. అతనో అద్భుతమైన కెప్టెన్. ఎంత విజయవంతం అయ్యాడు. సహనం కోల్పోతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. పరిస్థితులు చేజారుతున్నాయని అనిపిస్తే ఆటగాళ్లను పిలిచి ఓపికతో మాట్లాడేవాడు. మార్పులు సూచించేవాడు. దాంతో అక్కడి పరిస్థితులు మారిపోయేవి. అదే అతనికి ఉన్న ప్రత్యేకత. వికెట్ల వెనకాల ఉండి కేవలం కీపింగ్ విధులకు పరిమితం కాలేదు. బౌలర్లకు పలు సూచనలు ఇచ్చాడు' అని 1970లలో వెస్టిండీస్ పేస్ బౌలర్ ఆయిన హోల్డింగ్ అన్నారు.

వికెట్‌ కీపర్‌గా అన్ని పరుగులు చేయడం అసాధ్యం:

వికెట్‌ కీపర్‌గా అన్ని పరుగులు చేయడం అసాధ్యం:

'ఒకసారి వెనకాలకు తిరిగిచూసుకుంటే ఎంఎస్ ధోనీకి అద్భుతమైన కెరీర్ ఉంది. టెస్టుల్లో 5000 పరుగులు చేశాడు. మహీ స్పెసలిస్ట్ బ్యాట్స్ మన్ కాదు, వికెట్ కీపర్. వికెట్‌ కీపర్‌గా అన్ని పరుగులు చేయడం అసాధారణం. ఇంత సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. వన్డేల్లోనూ దాదాపు 11000 పరుగులకు చేరువయ్యాడు. ఇన్ని సంవత్సరాలుగా కెరీర్ కొనసాగించుకోవడానికి .ఫిట్‌నెస్‌ కూడా ముఖ్యం. మహీ ఏ రోజు గాయాల బారిన పడలేదు' అని మైకెల్ హోల్డింగ్‌ చెప్పుకొచ్చారు.

90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు:

90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు:

అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల బాదాడు. రెండు అర్థ శతకాలు నమోదుచేశాడు. ఇక 190 ఐపీఎల్ మ్యాచులలో 4432రన్స్ చేశాడు.

ఐపీఎల్ 2020 షెడ్యూల్‌ విడుదల చేయకపోవడానికి కారణం ఇదేనా?

Story first published: Monday, August 24, 2020, 15:31 [IST]
Other articles published on Aug 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+