For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ బ్యాట్ పట్టనున్న స్మిత్, వార్నర్‌లు

Michael Di Venuto wants a piece of Steve Smith, David Warner

హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి ఏడాది పాటు నిషేదాజ్ఞలకు గురైన స్మిత్, వార్నర్‌లకు శుభవార్త. కొద్ది రోజుల క్రితం వరకు క్రికెట్‌లో పదే పదే నలిగిన విషయంలో కొంతవరకూ పర్వాలేదనిపించింది ఆస్ట్రేలియా క్రికెట్. వీరిద్దరిపై నిషేదం విధించిన ఏడాది కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే కౌంటీ క్రికెట్‌లో వార్నర్ లేక స్మిత్‌లకు ఆడే అవకాశం రావొచ్చని ఆస్ట్రేలియా మాజీ కోచ్ మైఖెల్ డి వెంటో తెలిపారు.

ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్ష స్కోరు వివరాల కోసం క్లిక్ చేయండి..

సుర్రే జట్టు తరఫున ఆడే ఆస్ట్రేలియా ఆటగాడు మిషెల్ మార్ష్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో సుర్రే అతని స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయంలో సదిగ్ధంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో అతని స్థానంలో వార్నర్ లేక స్మిత్‌లను తీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్‌లు ఆ దేశంలో ప్రీమియర్ మ్యాచ్‌లతో పాటు, సమాజసేవ కోసం 100 గంటల పాటు క్లబ్ క్రికెట్‌లో ఆడే వెసులుబాటు కల్పించింది.

కౌంటీ క్రికెట్‌లో:
కౌంటీ క్రికెట్‌లో వీరిద్దరిలో ఒకరిని సుర్రే జట్టులో తీసుకొనే అవకాశం ఉందని ఆయన బుధవారం తెలిపారు. ''వాళ్లద్దరు ఏదో ఒక రోజు క్రికెట్ ఆడాల్సిందే. అయితే ఈ టోర్నమెంట్‌లో వాళ్లను ఆడేందుకు అనుమతిస్తారో లేదో అన్న విషయం క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్లకు విధించిన నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది'' అని అన్నారు.

ఆస్ట్రేలియాలో మాత్రమే వర్తిస్తాయి:
ఈ నిబంధనలు వాళ్లకి ఆస్ట్రేలియాలో మాత్రమే వర్తిస్తాయి.. ఇతర దేశాల్లో ఎటువంటి ఆంక్షలు లేదు. దీంతో ఇంగ్లాండ్ వీళ్లు ఆడేందుకు ఎటువంటి ఆభ్యంతరం ఉండదనే భావిస్తున్నట్లు డి వెంటో అన్నారు. ''వాళ్లిద్దరు మానసికంగా క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉంటే, దానికి ఈసీబీ అందుకు అనుమతిస్తే.. మాకు ప్రపంచంలోనే బెస్ట్ ఆటగాళ్లు జట్టులోకి వస్తారు'' అని ఆయన తెలిపారు. మైఖెల్ డి వెంటో 2013-16 సమయంలో ఆస్ట్రేలియా కోచ్‌గా పని చేశారు. డారెన్ లెమన్ అనారోగ్యంగా ఉన్న సమయంలోనూ మైఖెల్ ఆస్ట్రేలియా కోచ్ బాధ్యతలు చేపట్టారు.

Story first published: Wednesday, April 18, 2018, 20:07 [IST]
Other articles published on Apr 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+