
హైదరాబాద్: అఫ్ఘనిస్థాన్‌తో చారిత్రక టెస్టులో ఆడనని కోహ్లి తీసుకున్న నిర్ణయం తనను ఆశ్యర్యపరచిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అంటున్నాడు. కౌంటీల నుంచి వచ్చి కోహ్లి ఆ టెస్టులో పాల్గొంటే బాగుంటుందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనకు మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు కౌంటీల్లో సర్రే తరపున కోహ్లి ఆడేందుకు వెళ్లడంతో జూన్ 4న అఫ్గాన్‌తో ఆరంభమయ్యే టెస్టుకు అతను అందుబాటులో ఉండట్లేదు.
కోహ్లి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 'విరాట్ నిర్ణయం పట్ల నిజంగా ఆశ్యర్యానికి గురయ్యా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అతనిష్టం. ఎవరితో అయినా టెస్టు మ్యాచ్ టెస్టు మ్యాచే. దానికి మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప భావన ఏదీలేదు. ఇంగ్లాండ్ నుంచి వచ్చి అతను ఈ టెస్టు ఆడతాడని అనుకుంటున్నా. అందుకతను షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పు చేసుకుంటే సరిపోతుంది' అని క్లార్క్ తెలిపాడు.
ఐర్లాండ్‌కు వెళ్లనున్న జట్టును తేదీ తదితర వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా జట్టు 11 ఏళ్ల తరువాత మళ్లీ ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ-20 మ్యాచ్‌ల నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.
ఐర్లాండ్ దేశ రాజధాని డబ్లిన్‌లో జూన్ 27, 29 తేదీల్లో జరగనున్న రెండు టీ-20 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, భారత్ జట్లు తలపడనున్నాయి. అదే టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లోనూ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా జట్టు వివరాలను వెల్లడించింది.