
విరాట్ కోహ్లీ దూకుడు
విరాట్ కోహ్లీ దూకుడుగా జట్టుని నడిపిస్తున్నాడని అన్నాడు. అయితే టీమిండియాకు ఈ దూకుడుని కోహ్లీ కంటే ముందు గంగూలీనే నేర్పించాడని చెప్పాడు. ‘భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. నిజాయతీగా చెప్పాలంటే టీమిండియాలో మంచి వాతావరణం సృష్టించిన ఘనత దాదాకే దక్కుతుంది' అని క్లార్క్ అన్నాడు.

గంగూలీ ఎప్పుడూ వెనకాల కూర్చోలేదు
'గంగూలీ ఎప్పుడూ వెనకాల కూర్చోలేదు. జట్టును ముందుండి నడిపాడు. ధోని, కుంబ్లే, కోహ్లీ వారి వారి పంథాలో దానిని కొనసాగిస్తున్నారు. విరాట్ కోహ్లీ, గంగూలీ ఇద్దరూ ఎలాంటి బెరుకు లేకుండా తమ బృందాలకు నాయకత్వం వహించారు' అని క్లార్క్ పేర్కొన్నాడు. 1990ల్లో ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను కఠిన పోటీదారుగా పరిగణించేవారు కాదని, కానీ, గంగూలీ నాయకత్వంలో ఆ దృక్పథం మారిందని క్లార్క్ చెప్పుకొచ్చాడు.

అంతిమంగా ఎవరు గెలిచారన్నదే కీలకం
టీమిండియాలో అతడు పరుగుల దాహం, పోరాట పటిమ పెంచాడని చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ వైఫల్యం లెక్కలోకి రాదని క్లార్క్ అన్నాడు. అంతిమంగా ఎవరు గెలిచారన్నదే కీలకమని, ఎవరు ఎన్ని పరుగులు చేశారో అవసరం లేదని ఈ సందర్భంగా క్లార్క్ పేర్కొన్నాడు. ఇక, కెప్టెన్సీ విషయానికి వస్తే స్మిత్‌తో పోలిస్తే కోహ్లీకే ఎక్కువ మార్కులు ఇస్తానని చెప్పాడు.

వన్డేల్లో కోహ్లీ... టెస్టుల్లో క్లార్క్
'వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయితే టెస్టుల్లో స్మిత్ గొప్ప ఆటగాడు. కెప్టెన్సీ విషయానికొస్తే ఇద్దరూ సమానమే. ఇప్పుడిప్పుడే తమ నాయకత్వశైలిని మెరుగుపర్చుకుంటున్నారు. కోహ్లీ లాగే భారత జట్టు కూడా ఈ మధ్య దూకుడుతనంతో దూసుకెళుతున్నది' అని క్లార్క్ అన్నాడు.


Click it and Unblock the Notifications











