ఆ దిగ్గజ స్పిన్నర్ మైదానంలోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు: మైకేల్ క్లార్క్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మైదానంలో అడుగుపెట్టే ముందు సిగెరేట్ కాల్చేవాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. కెరీర్ మొత్తంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన స్పిన్ మాంత్రికుడు.. అఫ్ ద ఫీల్డ్ విషయాల గురించి ఉపశమనం పొందేందుకే ఆ విధంగా చేసేవాడని తెలిపాడు. వార్న్‌కు మానసిక ధైర్యం ఎక్కువని, అదే అతని బలమని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మైకేల్ క్లార్క్.. షేన్ వార్న్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

'వార్న్.. ఆన్ ఫీల్డ్‌లో ఏ రకంగా రెచ్చిపోయేవాడో, అఫ్ ద ఫీల్డ్ కూడా అదే రకంగా ప్రవర్తించి వివాదాలను కొని తెచ్చుకునేవాడు. దాంతో అతను మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు సిగరెట్ కాల్చేవాడు. తన వ్యక్తిగత విషయాలు ఆటపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే అతను అలా చేసేవాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్న్.. తన హయాంలో ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిపాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాల్లో మీడియా వార్న్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసేది. దానికి అతను మైదానంలోనే బదులిచ్చేవాడు. మైదానం వెలుపల అతని ప్రవర్తన ఎలా ఉన్నా, దాని ప్రభావాన్ని మాత్రం ఆన్ ఫీల్డ్ ఎప్పుడూ చూపించేవాడు కాదు.'అని చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న వార్న్.. 145 మ్యాచుల్లో 708 వికెట్లు సాధించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 25, 2021, 17:10 [IST]
Other articles published on May 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X