ఐపీఎల్ 10 సంబరాల సమయం: ఆసక్తిగా ఎదురుచూపులు
హైదరాబాద్: కొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ 10వ సీజన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే స్టార్ క్రికెటర్లందరూ నగరానికి విచ్చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన డ్యాన్స్‌తో సందడి చేయనుంది. ఆరు నిమిషాలపాటు జరిగే ప్రదర్శనలో అమీ స్టేజ్‌ను హీటెక్కించనుంది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ తమ్మ తమ్మ, లెట్స్ నాచో, కర్ గయీ చుల్లా, కాలా చష్మా లాంటి పాటలకు డ్యాన్స్ చేయనుంది.
అమీ నృత్య ప్రదర్సన అనంతరం హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆసీస్ మాజీ క్రికెటర్లు తెలిపారు. బ్రెట్ లీ, మైకెల్ క్లార్క్ ఈ ఐపీఎల్ సీజన్‌కు కామెంటేటర్లుగా వ్వవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు వీరు ట్విటర్‌లో పోస్టు చేశారు. బుధవారం సాయంత్రం 6.30గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. అనంతరం రాత్రి 8గంటలకు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications