కోహ్లీ లేపోవడమా?, పెద్ద జోక్: ఐసీసీ ఎంపికపై క్లార్క్
హైదరాబాద్: ఐసీసీ ఎంపిక చేసిన అత్యుత్తమ టెస్టు జట్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయకపోవడాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తీవ్రంగా తప్పుబట్టాడు. కోహ్లీని విస్మరించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను అదనపు ఆటగాడిగా తీసుకోవడం బాధించిందని క్లార్క్ చెప్పాడు.
'ఐసీసీ టెస్ట్ జట్టును చూశాను. స్మిత్‌ను 12వ ఆటగాడిగా తీసుకున్నారు? ప్రపంచ 11 మంది అత్యుత్తమ బృందంలో విరాట్ కోహ్లీకే చోటు దక్కలేదు? వీరిద్దరూ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. ఈ ఎంపిక అర్ధం లేనిది' అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
కాగా, టీమిండియాను కోహ్లీ వరుసగా ఐదు టెస్టు (శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్) సిరీస్‌ల్లో విజేతగా నిలిపాడు. ఇక ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 4-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఎనిమిది టెస్టుల్లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ జట్టుకు సారథ్యం వహించిన అలిస్టర్ కుక్‌ను ఐసీసీ టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా చేయడం పెద్ద జోక్ అని బ్రిటీష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ఐసీసీ వార్షిక అవార్డుల్లో అశ్విన్ పంట పడింది. ప్లేయర్‌గా ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి ప్రతిష్ఠాత్మక సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌నూ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీకి టెస్టు జట్టులో చోటు లభించకపోవడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వివరణ ఇచ్చింది.

ఐసీసీ టెస్టు జట్టును క్రికెట్ మాజీ దిగ్గజాలైన రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, గ్యారీ కిరెస్టన్‌లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 2015, సెప్టెంబర్ 14 నుంచి 2016, సెప్టెంబర్ 20 మధ్య ప్రదర్శన ఆధారంగా జరిగిన ఓటింగ్ ద్వారా అవార్డులను ప్రకటించామని పేర్కొంది. ఈ సమయానికి విరాట్ కోహ్లీ 8 టెస్టులాడి 45.1 సగటుతో 451 పరుగులు చేశాడు.
అందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. ఐసీసీ జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ ఆ కాలంలో మెరుగైన ప్రదర్శన చేశారు. కానీ ఈ జట్టును ప్రకటించే సమయానికి ఆయా ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే మాత్రం కోహ్లి ఈ జట్టులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే 2016 సంవత్సరానికి చూస్తే కోహ్లి ఎంతో ఎత్తులో నిలుస్తాడు. 12 టెస్టుల్లో 75.93 సగటుతో 1215 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications