మృతి చెందిన హ్యూస్ 16వ ప్లేయర్: గెలిచాక క్లార్క్ ఉద్వేగం (పిక్చర్స్)
మెల్బోర్న్: ఐసీసీ ప్రపంచ కప్ 2015 ట్రోఫీ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా సారథి మైకేల్ క్లార్క్ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ ట్రోఫీని తన లిటిల్ బ్రదర్ ఫిలిప్ హ్యూస్‌కు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఫిలిప్ హ్యూస్ గత ఏడాది నవంబర్ నెలలో బంతి తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆదివారం నాడు మెల్బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ)లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పైన గెలుపొందింది. ఇది క్లార్క్‌కు ఫైనల్ వన్డే. ఫిలిప్ హ్యూస్ మృతి అనంతరం.. ఆస్ట్రేలియా జట్టు చాలా కృంగిపోయింది. ఇది తమకు క్లిష్టమైన సమయమని క్లార్క్ అన్నాడు.
మ్యాచ్ అనంతరం క్లార్క్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచ కప్‌ను తాము పదహారు మంది ఆటగాళ్లతో ఆడామన్నాడు. ఈ రోజు గెలిచిన ఈ ట్రోఫీని తాను తన లిటిల్ బ్రదర్ హ్యూస్‌కు అంకితమిస్తున్నానని చెప్పాడు. టోర్నీలో 'పీహెచ్' ఉన్న ఆర్మ్ బ్యాండ్ ధరించాడు. తాను ఎప్పుడు ఆసిస్ తరఫున ఆడినా దీనిని ధరిస్తానని చెప్పాడు. హ్యూస్ మృతి నేపథ్యంలో.. ఆ తర్వాత కాలం తమకు చాలా క్లిష్టమైనదన్నాడు.

మైకేల్ క్లార్క్
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. 72 బంతుల్లో 74 పరుగులు చేసిన మైకేల్ క్లార్క్.

అభినందన
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా గెలిచిన అనంతరం మైకేల్ క్లార్క్‌కు కివీస్ సారథి బ్రెండన్ మెకల్లమ్ అభినందన.

ఆనందం
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. కివీస్ పైన గెలిచిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందం.

వికెట్ తీసిన ఆనందం
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. కివీస్ వికెట్ తీసిన జేమ్స్ ఫాల్కనర్‌ను అభినందిస్తున్న సహచరులు.

అభిమానులు
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ చూసేందుకు హాజరైన అభిమానులు.

మైకేల్ క్లార్క్
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. 72 బంతుల్లో 74 పరుగులు చేసిన మైకేల్ క్లార్క్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications