పీఏతో మైకేల్ క్లార్క్ రాసలీలలు.. భార్యతో వివాదాలకు కారణమిదేనా?

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, అతడి సతీమణి కైలీ క్లార్క్ మధ్య విభేదాలు వచ్చాయా? అంటే అవుననే అంటోంది ఆసీస్ మీడియా. ఈ విభేదాలకు క్లార్క్ అసిస్టెంట్ షాష ఆర్మ్‌స్ట్రాంగ్ కారణమంటూ ఆస్ట్రేలియాకు చెందిన వార్తా పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.
తనను ఎంతగానో ప్రేమించిన బిజినెస్ ఓనర్, మోడల్ అయిన కైలీ బోల్డీని మే 15, 2012న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి అప్పట్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన పలువురు క్రికెటర్లు సైతం హాజరయ్యారు. ఐదేళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
క్లార్క్-కైలీ జంటకు కెల్సే లీ అనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి విభేధాలు రావడంతో ప్రస్తుతం దూరంగా ఉన్నట్లు ఆసీస్ పత్రికలు రాసుకొచ్చాయి. గత వారంలో జరిగిన పాపులర్ రేసింగ్ ఈవెంట్ మెల్‌బోర్న్ కప్‌లో క్లార్క్ భార్య కైలీ ఒక్కతే హాజరుకావడం ఈ అనుమానాలకు తావిస్తోంది.

వెడ్డింగ్ రింగ్ లేకుండానే మెల్‌బోర్న్ కప్‌కు
దీంతో పాటు మెల్‌బోర్న్ కప్‌కు కైలీ చేతికి వెడ్డింగ్ రింగ్ లేకుండానే హాజరైంది. దీంతో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో సైతం హాల్ చల్ చేస్తున్నాయి. క్లార్క్-కైలీ విడిపోవడానికి ప్రధానం కారణం క్లార్క్ తన అసిస్టెంట్ షాష ఆర్మ్‌స్ట్రాంగ్‌తో సన్నిహితంగా మెలగడమేనని తెలుస్తోంది.

సిడ్నీలోని ఓ లగ్జరీ యాచెట్‌లో
సిడ్నీలోని ఓ లగ్జరీ యాచెట్‌లో తన అసిస్టెంట్ షాష ఆర్మ్‌స్ట్రాంగ్ బికినీలో ఉండగా ఆమె పక్కనే మైకేల్ క్లార్క్ కూర్చుని ఉన్న ఫోటోలను ఉమెన్స్ డే రోజున ఓ ఆస్ట్రేలియా మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ఫోటోలను చూసిన కైలీకి క్లార్క్ తన అసిస్టెంట్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్నాడనే భావన కలిగించడంతో అతడికి దూరంగా ఉన్నట్లు ఆసీస్ మీడియా పేర్కొంది.

క్లార్క్‌తో షాష ఉన్న ఫోటోలు కైలీకి కోపం
"క్లార్క్‌తో షాష ఉన్న ఫోటోలు కైలీకి కోపం తెప్పించాయి. ఆమె కూడా మహిళే కదా? క్లార్క్, షాష ఓ బలీమైన రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఫోటోలను చూస్తుంటే తెలుస్తోంది. బిజినెస్ విషయానికి వస్తే కైలీతో పోలిస్తే షాషకే క్లార్క్ ఎక్కువ ప్రయారిటీని ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందుకు షాషను క్లార్క్ పీఏగా నియమించుకున్నాడు" అని రాసుకొచ్చింది.

2014 నుంచి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా
క్లార్క్ వద్ద 2014 నుంచి షాష ఆర్మ్‌స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. షాష ఆర్మ్‌స్ట్రాంగ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం 2017లో మైకేల్ క్లార్క్ క్రికెట్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమింపబడింది. ఇక, క్లార్క్ విషయానికి వస్తే 2003లో వన్డేల్లో, తర్వాతి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

ఆస్ట్రేలియా జట్టు తరుపున 114 టెస్టులాడిన క్లార్క్
ఆస్ట్రేలియా జట్టు తరుపున 114 టెస్టుల్లో 49.3 సగటుతో 8628 పరుగులు (28 సెంచరీలు), 245 వన్డేల్లో 44.58 సగటుతో 7981 పరుగులు (8 సెంచరీలు) చేశాడు. 2011లో రికీ పాంటింగ్ నుంచి పగ్గాలు అందుకున్నాడు. ఆస్ట్రేలియా 46 టెస్టుల్లో నాయకత్వం వహించి 23 మ్యాచ్‌ల్లో విజయాలందించిన క్లార్క్ 74 వన్డేల్లో 50 విజయాలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications