For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ Vs IRE T20I Series: టీ20ల్లో తన మొట్టమొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన మైఖెల్ బ్రేస్‌వెల్..!

Michael Bracewell did a Hattrick On His First Over Of T20 Match

ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టీం టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తేడాతో గెలుపొందింది. ఇక ఈ పర్యటనలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖెల్ బ్రేస్‌వె‌ల్ తన అసాధారణ ఫామ్‌ను కొనసాగించాడు. ఇక నిన్న జరిగిన 2వ టీ20లో అతను తన తొలి టీ20 మ్యాచ్ తొలి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. బ్రేస్‌వెల్ 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా ఐర్లాండ్‌ 91పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్‌ 88పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఇక అంతకుముందు మొదటి టీ20లో 31పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. ఇక రెండో టీ20లో తొలుత న్యూజిలాండ్ 4వికెట్లు కోల్పోయి 179పరుగులు చేయగా.. 180 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ 86పరుగులకు 7వికెట్లు కోల్పోయింది. ఇక 14వ ఓవర్‌లో బ్రేస్‌వెల్ తన తొలి టీ20 ఓవర్ వేశాడు. అతను వేసిన తొలి బంతికే ఐర్లాండ్ ప్లేయర్ బారీ మెక్‌కార్తీ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత సింగిలొచ్చింది.

ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు పడ్డాయి. తొలుత మార్క్ అడైర్‌ను బ్రేస్‌వెల్ క్యాచ్ అవుట్ చేశాడు. డిప్ మిడ్ వికెట్లో అతను ఫీల్డర్‌కు చిక్కాడు. తర్వాత స్ట్రైక్ తీసుకున్న మెక్‌కార్తీ హిట్ చేయగా.. లెగ్ సైడ్ డౌన్ రోప్స్ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. తర్వాత చివరి వికెట్‌కు బరిలోకి దిగిన క్రెయిగ్ యంగ్ పాయింట్లో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో బ్రేస్ వెల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇకపోతే మైఖెల్ బ్రేస్‌వెల్ తొలి టీ20లో బౌలింగ్ చేయలేదు. అంతకుముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు.

వన్డే సిరీస్‌లో అతను తన బ్యాటింగ్‌‌తో న్యూజిలాండ్‌కు అద్వితీయ విజయాలను అందించాడు. మొదటి వన్డేలో బ్రేస్‌వెల్ దాదాపు ఒంటిచేత్తో 82బంతుల్లో అజేయంగా 127పరుగులు చేసి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతను కేవలం 74బంతుల్లోనే తన సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత అతను చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టి న్యూజిలాండ్‌ను గెలిపించాడు.

Story first published: Thursday, July 21, 2022, 16:52 [IST]
Other articles published on Jul 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+