For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్టువర్ట్ బ్రాడ్ 500 వికెట్లతో ఆగడు.. 600వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు'

Michael Atherton Backs Stuart Broad To Reach Milestone Of 600 Test Wickets

మాంచెస్టర్​: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్​లో 600 వికెట్లను పడగొట్టగలడని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ ఆథెర్టన్​ అన్నారు. తనలో దూకుడు, వేగం ఏ మాత్రం తగ్గలేదని వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​లో బ్రాడ్​ నిరూపించాడని ఆయన చెప్పారు. వెస్టిండీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లు తీసిన బ్రాడ్​.. రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో 499 వికెట్ల దగ్గర నిలిచాడు.

మరో వికెట్ పడగొడితే:

మరో వికెట్ పడగొడితే:

మాంచెస్టర్ టెస్టులో మరో వికెట్ పడగొడితే టెస్టుల్లో 500 వికెట్లు సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్​గా స్టువర్ట్ బ్రాడ్ ఘనత సాధిస్తాడు. ఇప్పటికే ఈ ఘనతను బ్రాడ్ సహచర ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ అందుకున్నాడు. అయితే సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్.. బ్రాడ్​ను పక్కనపెట్టాడు. సీనియర్ పేసర్ అయిన బ్రాడ్​ను తప్పించడం కాస్త వివాదాస్పదమైంది. మాజీలు కూడా ఘాటుగానే స్పందించారు. ఈ నేపథ్యంలో మైకేల్ అథెర్టన్ కూడా స్పందించారు.

500 వికెట్లతో ఆగడు:

500 వికెట్లతో ఆగడు:

'చాంపియన్ క్రీడాకారుడిని జట్టులో నుంచి తప్పిస్తే.. మళ్లీ అంతకు మించిన వేగంతో తిరిగి వస్తాడు. ఈ సిరీస్​లో స్టువర్ట్ బ్రాడ్​ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఒక్కోసారి జట్టులో చోటు దక్కనప్పుడే మన గురించి మనకు తెలుస్తుంది. బ్రాడ్ జోరు చూస్తే 500 వికెట్లతో అసలు ఆగడు. 600 వికెట్ల మార్కును చేరాలనుకుంటాడు. ఇప్పటికీ అతడిలో ఎంతో స్టామినా ఉంది. సుదీర్ఘంగా బౌలింగ్ చేయగలడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటాడు' అని అథెర్టన్ అన్నారు.

వార్న్‌ బ్యాటింగ్‌ శైలి అనుకరించడంవల్లే:

వార్న్‌ బ్యాటింగ్‌ శైలి అనుకరించడంవల్లే:

స్టువర్ట్ బ్రాడ్ మూడో టెస్టులో దూకుడుగా ఆడి 62 పరుగులు (45 బంతుల్లో) చేయడంతో ఇంగ్లండ్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (33 బంతుల్లో)లు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్‌ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ బ్యాటింగ్‌ శైలిని అనుకరించడంవల్లే భారీ పరుగులు చేశానని బ్రాడ్‌ చెప్పాడు. 'వ్యూహాత్మకంగా అదే సరైన పని. వార్న్‌లా ఆడమని ప్రధాన కోచ్‌ పీటర్‌ మూర్స్‌ చెప్పాడు. 2005 యాషెస్‌ సిరీస్‌లో అతడెలా ప్రభావవంతంగా ఆడాడో గుర్తుచేశాడు. మైదానంలో ఖాళీలను గుర్తించా. వార్న్‌లా ఆడాలని నిర్ణయించుకున్నా. ఆఫ్‌ సైడ్‌లో పరుగులు రాబట్టా' అని బ్రాడ్‌ తెలిపాడు.

Story first published: Monday, July 27, 2020, 20:19 [IST]
Other articles published on Jul 27, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+