అందుకే ఓడాం: రోహిత్ శర్మ

MI vs SRH: Rohit Sharma says Tim Davids run-out as MI lose tense match against SRH

ముంబై: కీలక సమయంలో తమ బ్యాటర్ రనౌటవ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన ముంబై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. టిమ్‌ డేవిడ్‌ క్రీజులో ఉన్నంతవరకు తాము మ్యాచ్‌లో ఉన్నామని అనుకున్నానని తెలిపాడు. అతని రనౌట్‌ దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు.

రనౌట్‌తో సీన్ మారింది..

రనౌట్‌తో సీన్ మారింది..

'18వ ఓవర్‌ వరకు మ్యాచ్‌ గెలుస్తుమానుకున్నాం. కానీ, ఆ ఓవర్ చివరి బంతికి టిమ్ డేవిడ్‌ రనౌటవ్వడం దురదృష్టకరం. అప్పటి వరకు మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నా. హైదరాబాద్‌ జట్టుకు అభినందనలు. ఈ గెలుపు క్రెడిట్ వాళ్లదే. చివరివరకూ అద్భుతంగా పోరాడారు. టీమ్ భవిష్యత్‌ నేపథ్యంలోనే యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చాం. కోర్ టీమ్ సత్తాను పరీక్షించే క్రమంలో ప్రయోగాలు చేస్తున్నాం.ఈ క్రమంలోనే కొంతమంది యువకులతో ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయించాలనుకున్నాం.

అందుకే యువ ఆటగాళ్లతో..

అందుకే యువ ఆటగాళ్లతో..

అయితే, హైదరాబాద్‌ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. దాంతో మా బౌలింగ్‌ తడబడింది. కానీ స్లాగ్ ఓవర్లలో పుంజుకొని భారీ స్కోర్‌ను అడ్డుకున్నాం. ఆ తర్వాత బ్యాట్‌తో రాణించి చివరివరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లినా గెలుపొందలేకపోయాం. ఇకపై ఆడాల్సిన చివరి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి విజయంతో ముగించాలనుకుంటున్నాం. వీలైతే కొంతమంది యువకులకు ఆడే అవకాశం కల్పిస్తాం' అని రోహిత్‌ పేర్కొన్నాడు.

త్రిపాఠి విధ్వంసం...

త్రిపాఠి విధ్వంసం...

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 3సిక్స్‌లు, 9 ఫోర్లతో 76) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నికోలస్ పూరన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) ధాటిగా ఆడారు. ముంబై బౌలర్లలో రమన్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.

ఫామ్‌లోకి రోహిత్

ఫామ్‌లోకి రోహిత్

అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48), ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), టీమ్ డేవిడ్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) రాణించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. సుందర్, భువీ చెరొక వికెట్ పడగొట్టాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 18, 2022, 13:08 [IST]
Other articles published on May 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X