Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs SRH: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్

MI vs SRH: ఐపీఎల్ 2025లో భాగంగా 33వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిం సీజన్-18లో మూడో విజయాన్ని సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వాంఖడే స్డేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడం ద్వారా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ గొప్ప రికార్డును సృష్టించింది. ఒకే మైదానంలో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వెనక్కి నెట్టింది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రికార్డు
గురువారం రాత్రి ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై జట్టు ఐపీఎల్ లో గొప్ప రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌లో ఒకే మైదానంలో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ ఇప్పుడు నిలిచింది. వాంఖడే స్టేడియంలో ముంబైకి ఇది 47వ మ్యాచ్. వాంఖడే స్టేడియంలో 47 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గతంలో ఈ రికార్డు కోల్‌కతా నైట్ రైడర్స్‌ పేరిట ఉండేది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

MI vs SRH Mumbai Indians Create History in IPL 2025 with Record Win at Wankhede

ఐపీఎల్‌లో ఒకే మైదానంలో అత్యధిక విజయాలు సాధించిన జట్లు

1 ముంబై- ముంబై ఇండియన్స్- 47(ఆడిన మ్యాచ్‌లు)- 29(గెలిచిన మ్యాచ్‌లు)
2 కోల్‌కతా- కోల్‌కతా నైట్ రైడర్స్- 40 (ఆడిన మ్యాచ్‌లు)- 28(గెలిచిన మ్యాచ్‌లు)
3 జైపూర్- రాజస్థాన్ రాయల్స్- 31- 24
4 బెంగళూరు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 41- 21
5 హైదరాబాద్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 32- 21
6 చెన్నై- చెన్నై సూపర్ కింగ్స్- 31- 20

4 వికెట్ల తేడాతో గెలిచిన ముంబై
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అభిషేక్ శర్మ 40 పరుగులు చేసి అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున బౌలింగ్ చేస్తున్నప్పుడు, విల్ జాక్స్ గరిష్టంగా 2 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, విల్ జాక్స్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, April 18, 2025, 11:03 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+