MI vs SRH: విఫలమైన భువీ.. చెలరేగిన పొలార్డ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టఫ్ టార్గెట్!

IPL 2021, MI vs SRH : స్లో వికెట్‌పై Sunrisers Hyderabad టార్గెట్‌ చేధిస్తుందా ?| Oneindia Telugu

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ మధ్య కీరన్ పొలార్డ్(22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. పొలార్డ్‌కు ముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), క్వింటన్ డికాక్(39 బంతుల్లో 5 ఫోర్లు 40) మంచి శుభారంభాన్ని అందించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. విజయ్ శంకర్(2/19), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/29) సూపర్ బౌలింగ్‌తో రాణించడంతో ఒకానొక దశలో ముంబై 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ చివర్లో పొలార్డ్ తన మార్క్ షాట్లతో చెలరేగడంతో సన్‌రైజర్స్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరి బౌలర్లకు తోడుగా ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీయగా.. రషీద్, భువీ వికెట్లు సాధించలేకపోయారు. భువీ అయితే దారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

మంచి స్టార్ట్..

మంచి స్టార్ట్..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ధాటిగా ఆడి మంచి ఆరంభాన్ని అందించారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే డికాక్ రెండు బౌండరీలు బాదగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన మూడో ఓవర్‌లో వరుస బంతుల్లో 4, 6 బాది రోహిత్ జోరు కనబర్చాడు. అనంతరం ఈ జోడీ ఆడపాదడపా బౌండరీలు బాదేయడంతో పవర్‌ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.

చెలరేగిన శంకర్..

చెలరేగిన శంకర్..

పవర్ ప్లే ముగిసిన వెంటనే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ డేవిడ్ వార్నర్.. విజయ్ శంకర్‌ను రంగంలోకి దింపాడు. అతని ఓవర్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు యత్నించిన రోహిత్.. బౌండరీ లైన్ వద్ద విరాట్ సింగ్‌కు చిక్కాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత శంకర్ వేసిన 9వ ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఓ భారీ సిక్సర్ కొట్టిన సూర్య ఆ మరుసటి బంతికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

కట్టడి చేసిన సన్‌రైజర్స్..

కట్టడి చేసిన సన్‌రైజర్స్..

క్రీజులోకి ఇషన్ కిషన్ రాగా.. రషీద్, మజీబ్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఓపెనర్ డికాక్.. ముజీబ్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు యత్నించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జే సుచిత్‌కు చిక్కాడు. ఇది హైదరాబాద్ తరఫున ముజీబ్‌కు ఫస్ట్ ఐపీఎల్ వికెట్. ఇక క్రీజులోకి డేంజరెస్ కీరన్ పొలార్డ్ రాగా.. హైదరాబాద్ బౌలర్లు బౌండరీలు ఇవ్వకుండా ఒత్తిడి పెంచారు. అయితే ముజీబ్ వేసిన 17వ ఓవర్‌లో పొలార్డ్ భారీ సిక్సర్ బాదాడు. అయితే అదే ఓవర్‌లో ఇషాన్ కిషన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా భువీ ఓవర్‌లో పొలార్డ్ బౌండరీ బాదడంతో 11 రన్స్ వచ్చాయి.

పొలార్డ్ మెరుపులు..

పొలార్డ్ మెరుపులు..

ఖలీల్ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికే బౌండరీ బాదిన పొలార్డ్.. మూడో బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. సులువైన క్యాచ్‌ను విజయ్ శంకర్ నేలపాలు చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే హార్దిక్ పాండ్యా .. విరాట్ సింగ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. భువీ వేసిన చివరి ఓవర్‌లో పొలార్డ్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో ముంబై 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. చివరి 5 ఓవర్లలో ముంబై 2 వికెట్లకు 49 రన్స్ చేయగా.. అందులో 17 రన్స్ చివరి ఓవర్‌లోనే వచ్చాయి. విజయ్ శంకర్ క్యాచ్ నేలపాలు చేయడంతో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. ఈ స్లో వికెట్‌పై ఈ టార్గెట్‌ను చేధించడం చాలా కష్టం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, April 17, 2021, 21:22 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X