MI VS SRH: ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలక కామెంట్స్ చేశాడు. హిట్ మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ ను చూసి ఎంతో నేర్చుకున్నట్లు వెల్లడించాడు.
చాలా నేర్చుకున్నా.
"రోహిత్ శర్మను చూసి ప్రేరణ పొందాను. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. అతడితో ఎక్కువ సమయం గడపలేకపోయాను. కానీ నిజంగా అతడు ఆడిన విధానం, అతడి చర్యలు చూసి చాలా నేర్చుకున్నాను. అతడి ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తాను. గత రెండేళ్లుగా కెప్టెన్‌గా టీమిండియాను అతడు నడిపిసోతున్న అద్భుతం. ఓపెనింగ్ బ్యాటర్‌గా అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఆటను దూకుడుగా ఆడుతూ, జట్టును ముందుండి నడిపిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు" అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.
అంతా తుస్సే...
ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్).. రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముంబయి జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, వరుస పరాజయాలతో సతమతమైన ఇరు జట్లు.. తాము ఆడిన తమ ఆఖరి (ఆరో) మ్యాచ్‌లను విజయాలతోనే ముగించాయి.
రోహిత్, ట్రావిస్ హెడ్ ఎన్ని పరుగులు చేశారంటే?
ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో ఆడట్లేద. ఆడిన ఐదు మ్యాచుల్లో 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడు తన బ్యాటను ఝళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తర్వాత ఆడబోయే మ్యాచుల్లోనైనా హిట్ మ్యాన్ రాణిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ట్రావిస్ హెడ్.. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 214 పరుగులు చేశాడు. అందులో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 67 పరుగులు.
