Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేసిన రోహిత్ (Video)

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కంటతడిపెట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని బాధతో ఏడ్చేశాడు. వాంఖడే వేదికగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48; 30 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్. కెప్టెన్ కమిన్స్ (35*; 17 బంతుల్లో, 2x4, 2x6) కీలక పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య (3/31), పీయూష్ చావ్లా (3/33) మూడు వికెట్లు తీశారు.

MI vs SRH Emotional Moment Rohit Sharma s Tears in Dressing Room Viral Video

ఛేదనలో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (102*; 51 బంతుల్లో, 12x4, 6x6) అజేయ శతకంతో చెలరేగాడు. సూర్యకు తోడుగా తిలక్ వర్మ (37*; 32 బంతుల్లో, 6x4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ముంబై 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ (4; 5 బంతుల్లో, 1x4) ఆదిలోనే ఔటయ్యాడు. కమిన్స్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న రోహిత్ కుమిలిపోయాడు. ఏమైందో తెలియదు. కానీ, హిట్ మ్యాన్ ఒక్కసారి కంటతడి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫామ్ కోల్పోయాననే బాధతో రోహిత్ ఏడ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి ఏడు మ్యాచ్‌లో రోహిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 45 సగటుతో 164 స్ట్రైక్‌రేటుతో 297 పరుగులు చేశాడు.

కానీ చివరి అయిదు మ్యాచ్‌లో పరుగులు చేయడానికి రోహిత్ శ్రమించాడు. అయిదు మ్యాచ్‌ల్లో కలిసి 33 పరుగులే చేశాడు. ఆరు సగటుతో, 94 స్ట్రైక్‌రేటుతో క్రీజులో కొద్దిసేపు నిలుస్తున్నాడు. సులువుగా వికెట్ సమర్పించుకుంటున్నానే కారణంతోనే రోహిత్ బాధపడి ఉంటాడని వాదనలు వినిపిస్తున్నాయి. మరో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్‌ను క్రికెట్ అభిమానులు ఇలా చూడలేకపోతున్నారు.

Story first published: Tuesday, May 7, 2024, 11:18 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+