
సెంచరీతో బట్లర్ విధ్వంసం
రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముంబై ఇండియన్స్‌పై తనకున్న మెరుగైన రికార్డును కొనసాగిస్తూ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బాసిల్ తంపి వేసిన నాల్గో ఓవర్లో 4, 6, 6, 4, 6 తో ఏకంగా 26 పరుగులు బాదాడు. అనంతరం 32 బంతుల్లో హాప్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన బట్లర్ ఐపీఎల్‌లో తన రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో బట్లర్ సెంచరీ కొట్టాడు. కాగా ఈ సీజన్లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.

పవర్‌ప్లేలో రెండు వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జస్ప్రీత్ బుమ్రా ఒక్క పరుగుకే ఫెమిలియన్ చేర్చాడు. దీంతో 13 పరుగులకే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అనంతర జట్లు స్కోర్ 48 పరుగుల వద్ద ఉండగా.. 7 పరుగులు చేసిన పడిక్కల్‌ను టైమల్ మిల్స్ ఫెమిలియన్ చేర్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 48 రన్స్ చేసింది.

హెట్‌మేయర్ మెరుపులు
ఈ క్రమంలో కెప్టెన్ సంజూ శాంసన్‌తో కలిసి మరో ఓపెనర్ బట్లర్ 3వ వికెట్‌కు 50 బంతుల్లోనే 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 21 బంతుల్లో 30 పరుగులు చేసిన శాంసన్.. పొలార్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తిలక్ వర్మకు చిక్కాడు. దీంతో 130 పరుగులకు రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హెట్‌మేయర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కీరన్ పొలార్డ్ వేసిన 17వ ఓవర్లో 6 6 4 4 Wd L4 1 ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. అయితే 14 బంతుల్లోనే 35 పరుగులు చేసిన హెట్‌మేయర్ బుమ్రా.. బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తిలక్ వర్మకు చిక్కాడు.

అదరగొట్టిన బుమ్రా
సెంచరీ చేసిన బట్లర్ కూడా అదే ఓవర్లో సరిగ్గా 100 పరుగులకు ఔటవడంతో 19 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ స్కోర్ 185- 6గా ఉంది. అదే ఓవర్లో అశ్విన్ ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు. ఇక మిల్స్ వేసిన చివరి ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మిల్స్ కూడా 3 వికెట్లు తీయగా పొలార్డు ఒక వికెట్ తీశాడు. చివర్లో బుమ్రా కట్టడి చేయడంతో రాజస్థాన్ స్కోర్ 200 దాటలేదు. ముఖ్యంగా అతను వేసిన 19వ ఓవర్లో 3 పరుగులు మాత్రమే రాగా 3 వికెట్లు పడ్డాయి.


Click it and Unblock the Notifications












