MI vs RR: ఓయ్ తిలక్‌వర్మ ఆ షాట్ ఏంటి? కొంచెమైతే కెమెరామెన్ తల పగిలేది! వీడియో వైరల్

ఐపీఎల్ 2022లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ముంబైపై ఆ జట్టు 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ కొట్టిన ఓ భారీ సిక్సు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ భారీ సిక్సర్ మ్యాచ్‌ను కవరేజీ చేస్తున్న కెమెరామెన్‌కు తగలడమే ఇందుకు కారణం.
కెమెరామెన్‌కు తగిలిన తిలక్ వర్మ సిక్సర్
రాజస్థాన్ రాయల్స్ విసిరిన 194 పరుగుల లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పోరాడుతున్నారు. అయితే అప్పటికే జోరు మీదున్న తిలక్ వర్మ.. రాజస్థాన్ బౌలర్ రియాన్ పరాగ్ వేసిన 12వ ఓవర్లో చెలరేగాడు. ఆ ఓవర్ ఐదో బంతిని భారీ సిక్సర్ బాదాడు. కానీ ఆ బంతి కాస్త నేరుగా వెళ్లి బౌండరీ లైన్ వెలుపల మ్యాచ్‌ను కవరేజ్ చేస్తున్న కెమెరామెన్‌కు తగిలింది.
సరిగ్గా అతని భుజానికి తగిలింది. కొంచెం పక్కకు పడి ఉంటే అతని తలపై పడి ఉండేది. అదృష్టం కొద్ది కెమెరామెన్ భుజానికి కూడా ఎటువంటి గాయం లేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

బట్లర్ సెంచరీ
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ సెంచరీ బాదడంతో భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో బట్లర్ 100, హెట్‌మేయర్ 35, శాంసన్ 30, పడిక్కల్ 7, పరాగ్ 5 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, మిల్స్ మూడేసి వికెట్లు, కీరన్ పొలార్డ్ ఒక వికెట్ తీశాడు.

రాజస్థాన్ విజయం
అనంతరం 194 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చివరకు 170 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు బ్యాటర్లలో తిలక్ వర్మ 61, ఇషాన్ కిషన్ 54 పరుగులతో రాణించారు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. ఇక మిగతా బ్యాటర్లలో ఎవరూ పెదగా రాణించకపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. మిగతా బ్యాటర్లలో పొలార్డ్ 22, రోహిత్ శర్మ 10, అశ్విన్ 6, అన్మోల్ ప్రీత్ సింగ్ 5 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ, యజుర్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు, ట్రెంట్ బోల్ట్, ప్రసిద్ధ్ క్రిష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. దీంతో ముంబైపై 23 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
స్కోర్లు:
రాజస్థాన్ రాయల్స్: 193-8
ముంబై ఇండియన్స్: 170-8
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications