Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RR: సెంచ‌రీతో బ‌ట్ల‌ర్ విధ్వంసం.. కానీ బుమ్రా ముందు తేలిపోయాడు.. 15 బంతుల్లో 11 ర‌న్సే!

MI vs RR: Jos Buttler vs Jasprit Bumrah - Buttler Century but just 11 Runs of 15 balls in bumrah bowling

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ముంబై బౌల‌ర్ల‌ను వీర బాదుడు బాదుతూ ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో తొలి సెంచ‌రీ న‌మెదు చేశాడు. ఈ క్ర‌మంలో ప్ర‌తి బౌల‌ర్ బౌలింగ్‌లో బట్ల‌ర్ ధారాళంగా ప‌రుగులు రాబట్టాడు. కానీ ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ధాన పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మాత్రం తేలిపోయాడు. మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ బుమ్రా బౌలింగ్‌లో మాత్రం బాల్‌కు ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేక‌పోయాడు.

 బ‌ట్ల‌ర్‌ను వ‌ణికించిన బుమ్రా

బ‌ట్ల‌ర్‌ను వ‌ణికించిన బుమ్రా

సెంచ‌రీతో చెల‌రేగిన‌ప్ప‌టికీ జోస్ బ‌ట్ల‌ర్‌ను జ‌స్ప్రీత్ బుమ్రా వ‌ణికించాడు. మ్యాచ్‌లో అంద‌రు బౌల‌ర్ల‌పై బ‌ట్ల‌ర్ పెత్త‌నం సాగిస్తే.. బ‌ట్ల‌ర్‌పై మాత్రం బుమ్రా పెత్త‌నం సాగించాడు. బుమ్రా వేసిన 15 బంతుల‌ను ఎదుర్కొన్న‌ బ‌ట్ల‌ర్.. కేవ‌లం 11 ర‌న్సే చేయ‌గ‌లిగాడు. బుమ్రా వేసిన తొలి రెండు బంతుల్లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేక‌పోయిన బ‌ట్ల‌ర్ మూడో బంతికి ఓ ఫోర్ బాదాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మ‌ళ్లీ 5 బంతుల్లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత ఓ సింగిల్ తీసి, ఒక ఫోర్ బాదాడు. ఆ త‌ర్వాత ఓ బంతిని డాట్ చేయ‌గా.. త‌ర్వాత వ‌రుస‌గా రెండు సింగిల్స్ తీసి ఓ బంతిని డాట్ చేశాడు. ఆ త‌ర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. మొత్తంగా 68 బంతుల్లో 100 ప‌రుగుల‌కు ఔట‌య్యాడు.

ముప్ప‌తిప్ప‌లు పెట్టిన బుమ్రా

ముప్ప‌తిప్ప‌లు పెట్టిన బుమ్రా

బుమ్రా బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ ఇలా 0, 0, 4, 0, 0, 0, 0, 0, 1, 4, 0, 1, 1, 0, W ఆడాడు. మొత్తానికి బ‌ట్ల‌ర్‌ను బుమ్రా ముప్ప‌తిప్ప‌లు పెట్టాడ‌ని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్ల‌లో 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన బుమ్రా 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్‌తోపాటు జైశ్వాల్, హెట్‌మేయ‌ర్‌ను బుమ్రా ఔట్ చేశాడు.

ముప్ప‌తిప్ప‌లు పెట్టిన బుమ్రా

ముప్ప‌తిప్ప‌లు పెట్టిన బుమ్రా

బుమ్రా బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ ఇలా 0, 0, 4, 0, 0, 0, 0, 0, 1, 4, 0, 1, 1, 0, W ఆడాడు. మొత్తానికి బ‌ట్ల‌ర్‌ను బుమ్రా ముప్ప‌తిప్ప‌లు పెట్టాడ‌ని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్ల‌లో 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన బుమ్రా 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్‌తోపాటు జైశ్వాల్, హెట్‌మేయ‌ర్‌ను బుమ్రా ఔట్ చేశాడు.

సెంచ‌రీతో బ‌ట్ల‌ర్ విధ్వంసం

బుమ్రాను మిన‌హాయిస్తే మిగ‌తా ముంబై బౌల‌ర్లంద‌రికీ జోస్ బ‌ట్ల‌ర్ చుక్క‌లు చూపించాడు. ముంబై ఇండియ‌న్స్‌పై త‌న‌కున్న మెరుగైన రికార్డును కొన‌సాగిస్తూ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. బాసిల్ తంపి వేసిన నాల్గో ఓవ‌ర్లో 4, 6, 6, 4, 6 తో ఏకంగా 26 ప‌రుగులు బాదాడు. అనంత‌రం 32 బంతుల్లో హాప్ సెంచ‌రీ పూర్తి చేశాడు. అనంత‌రం మ‌రింత దూకుడుగా ఆడిన బ‌ట్ల‌ర్ ఐపీఎల్‌లో త‌న రెండో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సుల‌తో బ‌ట్ల‌ర్ సెంచ‌రీ కొట్టాడు. కాగా ఈ సీజ‌న్లో ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం.

తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

ముంబై ఇండియ‌న్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ కృష్ణ

Story first published: Saturday, April 2, 2022, 18:56 [IST]
Other articles published on Apr 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+