Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RR: 104 మీట‌ర్ల సిక్స‌ర్‌తో బ‌ట్ల‌ర్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్‌లో 26 ర‌న్స్‌తో తంపికి చుక్క‌లు

MI vs RR: Jos Butler hit a six 104 meters in Basil Thampi bowling and that over hit 26 runs

ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్ ఓపెన‌ర్ జోస్ బట్ల‌ర్ విధ్వంసం సృష్టించాడు. ముంబై బౌల‌ర్ బాసిల్ తంపి వేసిన నాల్గో ఓవ‌ర్లో ఏకంగా 26 ప‌రుగులు సాధించి అత‌నికి చుక్క‌లు చూపించాడు. ఈ క్ర‌మంలో ఓ బంతిని ఏకంగా 104 మీట‌ర్ల దూరం సిక్స‌ర్ బాదాడు. ఆ త‌ర్వాత కూడా ఏ మాత్రం దూకుడు త‌గ్గించ‌ని బ‌ట్ల‌ర్ హాఫ్ సెంచ‌రీ కూడా పూర్తి చేశాడు. అయితే బ‌ట్ల‌ర్ బాదిన 104 మీట‌ర్ల సిక్స‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

104 మీట‌ర్లు సిక్స్‌.. ఒకే ఓవ‌ర్లో 26 ప‌రుగులు

104 మీట‌ర్లు సిక్స్‌.. ఒకే ఓవ‌ర్లో 26 ప‌రుగులు

ముంబై బౌల‌ర్ బాసిల్ తంపి వేసిన‌ నాల్గో ఓవ‌ర్ మూడో బంతిని జోస్ బ‌ట్ల‌ర్ ఏకంగా 104 మీట‌ర్ల భారీ సిక్స్ బాదాడు. బ‌ట్ల‌ర్ ఈ భారీ సిక్స‌ర్ ప్రేక్ష‌కుల మ‌ధ్యలో ప‌డింది. బ‌ట్ల‌ర్ బాదిన ఈ 104 మీట‌ర్ల సిక్స‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది ఆ త‌ర్వాతి బంతిని కూడా సిక్స‌ర్ బాదిన బ‌ట్ల‌ర్.. దానిని కూడా 90 మీట‌ర్ల దూరం బాదాడు. ఆ ఓవ‌ర్లో బ‌ట్ల‌ర్ వ‌రుస‌గా 0, 4, 6, 6, 4, 6 బాది ఏకంగా 26 ప‌రుగులు రాబ‌ట్టాడు. థంపి మ్యాచ్‌లో వేసిన ఫ‌స్ట్ ఓవ‌ర్లోనే ఈ స్థాయి ప‌రుగులు రావ‌డం గ‌మ‌నార్హం.

బ‌ట్ల‌ర్ హాఫ్ సెంచ‌రీ

బ‌ట్ల‌ర్ హాఫ్ సెంచ‌రీ

ఈ మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్ హాఫ్ సెంచ‌రీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో బ‌ట్ల‌ర్‌కు ఇది 12వ హాఫ్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 67 మ్యాచ్‌లాడిన బ‌ట్ల‌ర్ 36 స‌గ‌టుతో 2080 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 124 ప‌రుగులుగా ఉంది. ఈ క్ర‌మంలో బ‌ట్ల‌ర్ 205 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు.

ముంబైపై మంచి రికార్డులు

ముంబైపై మంచి రికార్డులు

ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై బ‌ట్ల‌ర్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబైపై బ‌ట్ల‌ర్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో రికార్డు స్థాయిలో 75 స‌గటుతో 300 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 94*గా ఉంది. స్ట్రైక్‌రేట్ 166గా ఉంది. దీనిని బ‌ట్టి ఈ లీగ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై బ‌ట్ల‌ర్‌కు తిరుగులేని రికార్డులు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

ముంబై ఇండియ‌న్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ కృష్ణ

Story first published: Saturday, April 2, 2022, 17:06 [IST]
Other articles published on Apr 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+