MI vs RCB Playing 11: ముంబైలోకి అర్జున్ టెండూల్కర్.. బెంగళూరులోకి మాక్స్‌వెల్.. తుది జట్లు ఇవే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు తలపడనున్నాయి. పుణే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర నిరాశలో ఉన్న 5 సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్థానంలో ఉంది. ఇక గత మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ సూపర్ ఫర్‌ఫామెన్స్‌తో గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లోనూ ఆ జోరు ప్రదర్శించాలని భావిస్తోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ 11పై ఆసక్తి నెలకొంది.

ముంబై ఇండియన్స్ బ్యాటర్లు వీళ్లే
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఏమి కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ముంబై ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. మూడో స్థానంలో జూనియర్ డివిల్లియర్స్ డెవాల్డ్ బ్రెవిస్ రానుండగా.. నాల్గో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక ఐదో స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఆరో స్థానంలో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ చేయనున్నారు

అర్జున్ టెండూల్కర్‌కు చోటు
గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన డేనియల్ సామ్స్ ప్లేసులో ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఐపీఎల్‌లోకి నేడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేయనున్నాడు. అర్జున్ టెండూల్కర్ గత సీజన్ నుంచి ముంబై జట్టులో ఉంటున్నప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కలేదు. కాగా జట్టులో అర్జున్ ఉంటే మరో ఆల్‌రౌండ్ బలం పెరుగుతుందని ముంబై మేనేజ్‌మెంట్ భావిస్తుందని సమాచారం. దీంతో అతన్ని ఈ రోజు మ్యాచ్‌లో తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సచిన్ టెండూల్కర్ అభిమానుల నిరీక్షణకు తెరపడినట్టే. కాగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడే అర్జున్ టెండూల్కర్ అనే సంగతి తెలిసిందే.

బౌలర్లు వీళ్లే
ఇక బౌలర్లుగా గత మ్యాచ్‌లో ఆడిన మురుగున్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి ఈ మ్యాచ్‌లోను కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుందని తెలుస్తోంది.

ఆర్సీబీలోకి మాక్స్‌వెల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టులో కూడా ఒక మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గ్లెయిన్ మాక్స్‌వెల్ బరిలోకి దిగడం ఖాయమనే చెప్పుకోవాలి. దీంతో పెదగా రాణించలేకపోతున్న డేవిడ్ విల్లీపై వేటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్‌లో ఫాఫ్ డుప్లిసెస్, అనుజ్‌రావత్ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాల్గో స్థానంలో గ్లెయిన్ మాక్స్‌వెల్ బ్యాటింగ్ చేయనున్నారు. ఐదో స్థానంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ఆరో స్థానంలో షాబాద్ నదీమ్, ఏడో స్థానంలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌కు రానున్నారు. ఇక బౌలర్లుగా హర్షల్ పటేల్, వసిందు హసరంగ, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు.

తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెయిన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications