
పుణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆరంభం నుంచే ఆకట్టుకుంటుంది. మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయంటే చాలు అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ప్రధాన జట్ల మధ్య పోరు, ప్రధాన ఆటగాళ్లు ఉన్న జట్ల మధ్య పోరు, ఫెవరేట్ ఆటగాళ్లు ఉన్న జట్ల మధ్య పోరుకు అయితే గిరాకీ మరింత ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అభిమానులు టీవీలకే పరిమితం కాకుండా మ్యాచ్‌లను వీక్షించడానికి మైదానాలకు కూడా వెళ్తున్నారు.
బీసీసీఐ మైదానాల్లో 25 శాతం ప్రేక్షకులకే అనుమతించినప్పటికీ.. గ్రౌండ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. స్టాండ్స్‌ల్లో 25 శాతానికి మించే ప్రేక్షకులు కనిపిస్తున్నారు. అయితే 25 శాతమే అని చెప్పినప్పటికీ ప్రేక్షకులు అంతకు మించే వస్తుండడంతో వారిని ఆపే సామర్థ్యం లేక మైదానం నిర్వహకులు కూడా లోపలికి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ నెల 9న ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను తాజాగా అందుబాటులో ఉంచగా.. కేవలం 4 గంటల్లో టికెట్లన్నీ అమ్ముడవడం గమనార్హం. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా టీమిండియా రోహిత్ శర్మ ఉండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. వీరిద్దరి మధ్య పోరు కావడంతో ఈ మ్యాచ్‌కు కావాల్సినంత క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌తోనే 4 గంటల్లోనే మ్యాచ్ టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.
ఇక ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఒకే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించి టోర్నీలో బోణి చేసింది. కాగా ఇప్పటికే 5 సార్లు ట్రోఫి గెలిచిన ముంబై ఇండియన్స్ జోరు మీద ఉండగా.. ఒక సారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది.