ఓపెనర్లు శుభారంభం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని అందించారు. ఫోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన మయాంక్.. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌ను మురుగన్ అశ్విన్ వదిలేశాడు. దీంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని మయాంక్ చెలరేగాడు. ఓపెనర్లద్దిరూ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంతో పవర్‌ప్లేలో పంజాబ్ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది.
మయాంక్, ధావన్ హాఫ్ సెంచరీలు
అనంతరం ఐపీఎల్ కెరీర్లో మయాంక్ అగర్వాల్ 12వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఎం. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మయాంక్ అగర్వాల్ (32 బంతుల్లో 52 రన్స్.. 6 ఫోర్లు, 2 సిక్సులు) బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు దొరికిపోవడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఐపీఎల్ కెరీర్లో శిఖర్ ధావన్ 45వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత 14వ ఓవర్లో బెయిర్‌స్టో(12)ను జయదేవ్ ఉనద్కత్, 15వ ఓవర్లో లివింగ్ స్టోన్(2)ను అద్భుత యార్కర్‌తో జస్ప్రీత్ బుమ్రా బౌల్డ్ చేశారు. దీంతో పంజాబ్ 130 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
జితేష్, షారూక్ మెరుపులు
ఇక జట్టు స్కోర్ 151 పరుగుల వద్ద ఉండగా బసిల్ థంపి వేసిన 17వ ఓవర్లో పొలర్డుకు క్యాచ్ ఇచ్చి శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70 రన్స్, 5 ఫోర్లు, 3 సిక్సులు) నాల్గో వికెట్ రూపంలో ఔటయ్యాడు. అయితే డెత్ ఓవర్లలో పంజాబ్ స్కోర్ బోర్డును జితేష్ శర్మ, షారూక్ ఖాన్ పరుగులు పెట్టించారు. వీరిద్దరి దూకుడుతో పంజాబ్ చివరి 5 ఓవర్లలో 66 రన్స్, చివరి 3 ఓవర్లలో 47 రన్స్ సాధించింది. ఉనద్కత్ వేసిన 18వ ఓవర్ తొలి 3 బంతులను 6, 4, 6 బాదిన జితేష్ ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. ఇక ఇక బేసిల్ థంపి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షారూక్ ఖాన్ 2 సిక్సులు బాదడంతో 16 రన్స్ వచ్చాయి. ఆ ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన షారూక్ (15) బౌల్డ్ అయ్యాడు. ఇక జితేషా శర్మ(30) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో థంపి 2, బుమ్రా. ఉనద్కత్, ఎం.అశ్విన్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












