
రోహిత్ మరొక ఫోర్ కొడితే
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 499 ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ మరొక ఫోర్ బాదితే ఈ లీగ్‌లో 500 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. దీంతో ఐపీఎల్‌లో ఈ రికార్డు సృష్టించిన ఆటగాడిగా నిలుస్తాడు. అయితే హిట్‌మ్యాన్ నేడు పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడబోయే మ్యాచ్‌లోనే ఈ రికార్డును అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 499 ఫోర్లతోపాటు 231 సిక్సులు కూడా కొట్టాడు.

25 రన్స్ చేస్తే 10,000 రన్స్
అలాగే టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 9,975 పరుగులు చేసిన రోహిత్ శర్మ మరొక 25 రన్స్ చేస్తే ఈ ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టిస్తాడు. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 5691 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3137 పరుగులు చేశాడు. టీ20 లీగ్ వంటి ఇతర టీ20 టోర్నీలో కూడా రాణించాడు.

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్
మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, షారుక్ ఖాన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్, బెన్నీ హోవెల్, భానుక రాజపక్స, సందీప్ శర్మ, రిషి ధావన్, బల్తేజ్ సింగ్, రిటిక్ ఛటర్జీ, ప్రేరక్ మన్కడ్, ఇషాన్ పోరెల్, అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, అన్ష్ పటేల్, రాజ్ బావా

ముంబై ఇండియన్స్ స్క్వాడ్
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, రమణదీప్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి, టైమల్ మిల్స్, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, సంజయ్ యాదవ్, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే, టిమ్ డేవిడ్, ఆర్యన్ జుయల్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, రాహుల్ బుద్ధి, అర్షద్ ఖాన్


Click it and Unblock the Notifications












