Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs PBKS: చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. టీ20 క్రికెట్‌లో 10 వేల ర‌న్స్ పూర్తి

MI vs PBKS: Rohit Sharma made history by completing 10,000 runs in the T20 format
IPL 2022 : Rohit Sharma Completes 10,000 Runs In T20 Format | Oneindia Telugu

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 10 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 ఫార్మాట్లో 10 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న రెండో భార‌త బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఏడో బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సిక్స్ కొట్టి మ‌రి హిట్‌మ్యాన్ ఈ రికార్డును చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే కాకుండా ఈ మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ 500 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు.

10 వేల ర‌న్స్ పూర్తి

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ టీ20 ఫార్మాట్లో 9,975 ప‌రుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మ‌రో 25 ప‌రుగులు చేసి హిట్‌మ్యాన్ 10 వేల ప‌రుగుల మార్క్‌ను చేరుకున్నాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవ‌ర్లో సిక్సు కొట్టి మ‌రి రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. దీంతో టీ20 ఫార్మాట్లో 10 వేల ర‌న్స్ పూర్తి చేసిన రెండో భార‌త బ్యాట‌ర్‌గా.. మొత్తంగా ఏడో బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. ఐపీఎల్‌లో 218 మ్యాచ్‌లు ఆడి 5719 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 125 మ్యాచ్‌లాడి 3313 ప‌రుగులు చేశాడు. మిగ‌తా ప‌రుగులు ఛాంపియ‌న్స్ లీగ్ వంటి ఇత‌ర టీ20 మ్యాచ్‌ల్లో చేశాడు.

అత్య‌ధిక ర‌న్స్ చేసిన ఆట‌గాళ్ల జాబితా

టీ20 ఫార్మాట్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ పేరు మీద ఉంది. టీ20 క్రికెట్‌లో గేల్ 14562 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో పాకిస్థాన్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ (11698 ), మూడో స్థానంలో వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ కీర‌న్ పొలార్డ్ (11474 ), నాల్గో స్థానంలో ఆస్ట్రేలియా ఆట‌గాడు ఆరోన్ ఫించ్ (10499 ), ఐదో స్థానంలో టీమిండియా ఆట‌గాడు విరాట్ కోహ్లీ (10379), ఆరో స్థానంలో ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ (10373), ఏడో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (10003) ఉన్నారు.

500 ఫోర్లు పూర్తి

ఇదే మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్‌లో 500 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. వైభ‌వ్ ఆరోరా వేసిన తొలి ఓవ‌ర్లో ఫోర్ కొట్ట‌డం ద్వారా హిట్‌మ్యాన్ ఈ రికార్డును చేరున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు 502 ఫోర్లు, 233 సిక్సులు బాదాడు.

మ‌రోసారి నిరాశ‌ప‌రిచిన రోహిత్ శ‌ర్మ‌

రెండు రికార్డులు సాధించిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా రోహిత్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. కొంతకాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడ‌లేక‌పోతున్న హిట్‌మ్యాన్‌ ఈ మ్యాచ్‌లోనూ త‌క్క‌వ స్కోర్‌కే ఔట‌య్యాడు. ఆరంభం నుంచి ఫోర్లు, సిక్సులతో దూకుడుగా ఆడుతూ క్రీజులో కుదురుకున్న‌ట్టే క‌నిపించిన రోహిత్ శ‌ర్మ భారీ ఇన్నింగ్స్ ఆడేలా క‌నిపించాడు. కానీ ర‌బాడ వేసిన నాల్గో ఓవ‌ర్లో బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ ఆ బంతి ఎక్కువ పేస్‌తో రావ‌డంతో బ్యాట్ హెడ్జ్‌కు త‌గిలి గాల్లోకి ఎగిరింది. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని వైభ‌వ్ ఆరోరా క్యాచ్ అందుకోవ‌డంతో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శ‌ర్మ 3 ఫోర్లు, 2 సిక్సుల‌తో 28 ప‌రుగులు చేశాడు.

Story first published: Wednesday, April 13, 2022, 22:33 [IST]
Other articles published on Apr 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+