మయాంక్ క్యాచ్ వదిలేసిన అశ్విన్
సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న మయాంక్ అగర్వాల్ నేటి మ్యాచ్‌లోనూ కాస్త తడబడుతూనే కనిపించాడు. తొలి బంతినే బౌండరీ బాదినప్పటికీ క్రీజులో సరిగ్గా కుదురుకోలేకపోయాడు. ఈ క్రమంలో మయాంగ్ అగర్వాల్‌పై మంచి రికార్డున్న జస్ప్రీత్ బుమ్రాకు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్ చివరి బంతిని మయాంగ్ అగర్వాల్ ఆఫ్ సైడ్ ఆడాడు. ఆ బంతి ఆఫ్ సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మురుగన్ అశ్విన్ వద్దకు నేరుగా వెళ్లింది. కానీ కాస్త పై నుంచి వెళ్లింది. అయితే ఆ బంతిని అందుకునేందుకు చేతులు పైకెత్తి క్రమంలో అశ్విన్ ఆలస్యమయ్యాడు. దీంతో బంతి అతని వేళ్లను తాకుతూ వెళ్లి బౌండరీ లైన్ దాటింది. దీంతో మయాంక్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అశ్విన్ నిర్లక్ష్యపు ఫీల్డింగ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మతో సహా బుమ్రా కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
చెలరేగిన మయాంక్ అగర్వాల్
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న మయాంక్ అగర్వాల్.. శిఖర్ ధావన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పవర్‌ప్లేలోని 65 పరుగులు చేశారు. అనంతరం మయాంగ్ అగర్వాల్ టీ20 క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఐపీఎల్‌లోనే 2229 పరుగులు చేశాడు. అనంతరం హాఫ్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కాగా ఐపీఎల్ కెరీర్లో 12వది. అయితే 9.3 ఓవర్లలో జట్టు స్కోర్ 97 పరుగుల వద్ద ఉండగా మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మయాంగ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు దొరికిపోయాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్ 6 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా క్యాచ్ వదిలేసిన అశ్విన్ బౌలింగ్‌లోనే మయాంక్ ఔటవడం గమనార్హం.

తుది జట్లు
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి.

హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ పోరులో పంజాబ్‌పై ముంబైదే స్వల్ప అధిక్యం ఉంది. ముంబై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు జట్లు తలపడినప్పుడు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ముంబై 223 పరుగులు చేయగా.. పంజాబ్ 230 పరుగులు చేసింది. ఇక అత్యల్పంగా ముంబై 87 పరుగులు, పంజాబ్ 119 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












