MI vs PBKS: పంజాబ్‌దే బ్యాటింగ్.. ఒక మార్పుతో బరిలోకి ముంబై ఇండియన్స్

పుణే: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఈ సీజన్‌లో ఇంకా బోణీ చేయని ముంబై ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇక పంజాబ్ విషయానికొస్తే ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది.

రోహిత్ శర్మ చెప్పింది ఇదే
''మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చాలా బాగుంది. మేము గతంలో ఆడిన పిచ్‌ల మాదిరిగానే ఇది కూడా కనిపిస్తోంది. పేసర్లుకు సహకరిస్తుంది. మొదటి విజయం సాధించడానికి టీంగా రాణించడం కోసం ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్‌లో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. గత మ్యాచ్‌కు దూరమైన టైమల్ మిల్స్ తిరిగి జట్టులో చేరాడు. దీంతో రమణదీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు.'' అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

మయాంక్ అగర్వాల్ చెప్పింది ఇదే
''మేము టాస్ గురించి పెదగా ఆలోచించడం లేదు. బ్యాటింగైనా, బౌలింగైనా రెండింటికీ సిద్ధంగా ఉన్నాం. జాంటీ రోడ్స్ మా బృందంలో ఉండడం మంచి విషయం. ఈ మ్యాచ్‌లో మా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు లేవు.'' అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి.

హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ పోరులో పంజాబ్‌పై ముంబైదే స్వల్ప అధిక్యం ఉంది. ముంబై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు జట్లు తలపడినప్పుడు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ముంబై 223 పరుగులు చేయగా.. పంజాబ్ 230 పరుగులు చేసింది. ఇక అత్యల్పంగా ముంబై 87 పరుగులు, పంజాబ్ 119 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications