For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs PBKS: జూనియ‌ర్ డివిల్లియ‌ర్ విధ్వంసం.. వ‌రుస‌గా 4 సిక్సులు.. సీజ‌న్‌లోనే అతిపెద్ద సిక్స‌ర్

MI vs PBKS: Mumbai Indians batsman Dewald Brevis hits 4 sixes in a row and hits a massive 118m six

పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్, జూనియ‌ర్ డివిల్లియ‌ర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంస‌క‌ర సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ చాహ‌ర్ వేసిన 9వ ఓవ‌ర్లో ఓ ఫోర్‌తోపాటు వ‌రుస‌గా 4 భారీ సిక్సులు బాది ఈ 18 ఏళ్ల ద‌క్షిణాఫ్రికా కుర్రాడు దుమ్ములేపాడు. అంతేకాకుండా ఈ క్ర‌మంలో 112 మీటర్ల భారీ సిక్స‌ర్ బాది ఈ సీజ‌న్‌లోనే అతి పెద్ద సిక్స‌ర్ న‌మోదు చేశాడు. రోహిత్ శ‌ర్మ ఔటైన వెంట‌నే నాల్గో ఓవ‌ర్ల‌నే క్రీజులో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.

ఆ వెంట‌నే ఇషాన్ కిష‌న్ కూడా ఔట‌వ‌డంతో తిల‌క్ వ‌ర్మ‌తో క‌లిసి ముఖ్య‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలోరాహుల్ చాహ‌ర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్లో విశ్వ‌రూపం చూపించాడు. ఆ ఓవ‌ర్ రెండో బ‌తిని ఫోర్ బాదిన డెవాల్డ్ బ్రెవిస్ రెండు, మూడు, నాలుగు, ఐదు బంతుల‌ను వ‌రుస‌గా భారీ సిక్స‌ర్లు బాదాడు. వ‌రుస‌గా 4 సిక్స‌ర్లు కొట్టేశాడు. దీంతో ఆ ఓవ‌ర్లో రాహుల్ చాహ‌ర్ ఏకంగా 29 ప‌రుగులు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత కూడా ఏ మాత్రం దూకుడును ఆప‌లేదు. ఈ క్ర‌మంలో తిల‌క్ వ‌ర్మ‌తో క‌లిసి మూడో వికెట్‌కు 41 బంతుల్లోనే 84 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

MI vs PBKS: Mumbai Indians batsman Dewald Brevis hits 4 sixes in a row and hits a massive 118m six

ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లోనే అతి పెద్ద సిక్స‌ర్ బాదేశాడు. ఏకంగా 112 మీట‌ర్ల భారీ సిక్స‌ర్ బాదాడు. 18 ఏళ్ల కుర్రాడు ఆడిన‌ తొలి సీజ‌న్‌లోనే ఇలా బాద‌డం చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 25 బంతులు ఎదుర్కొన్న డెవాల్డ్ బ్రెవిస్ 5 సిక్సులు, 4 ఫోర్ల‌తో 49 ప‌రుగులు బాది తృటిలో హాఫ్ సెంచ‌రీ చేజార్జుకున్నాడు. ఏకంగా 196 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఓడియ‌న్ స్మిత్ వేసిన 11వ ఓవ‌ర్లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి అర్ష్‌దీప్ సింగ్‌కు దొరికిపోయాడు.

Story first published: Wednesday, April 13, 2022, 23:14 [IST]
Other articles published on Apr 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+