Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs PBKS: కొంపముంచిన రనౌట్లు.. ముంబై ఇండియ‌న్స్ ఓట‌మికి 4 ప్ర‌ధాన కార‌ణాలు ఇవే!

MI vs PBKS: 4 main reasons for Mumbai Indians defeat in the match against Punjab Kings

ఐపీఎల్ 2022లో ముంబై ఇండియ‌న్స్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొనసాగుతుంది. సీజ‌న్‌లో ఆ జ‌ట్టు తొలి విజ‌యం కోసం మ‌రింత నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు. ఒకటి కాదు, రెండు కాదు వ‌రుస 5 ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడి 5 సార్ల ఛాంపియ‌న్ టీం గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటుంది. అయితే బుధ‌వారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మిని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

199 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో యువ బ్యాట‌ర్ల దూకుడుతో ఒకానొక ద‌శ‌లో గెలిచేలా క‌నిపించిన‌ప్ప‌టిక ప‌లు త‌ప్పుల‌తో మ్యాచ్‌ను చేజార్జుకుంది. అంత‌కుముందు కూడా ఫీల్డింగ్ పొర‌పాట్ల‌తో పంజాబ్ 198 ప‌రుగుల భారీ స్కోర్ సాధించేందుకు స‌హ‌క‌రించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మికి 4 ప్ర‌ధాన కార‌ణాల‌ను క్రీడా విశ్లేష‌కులు చ‌ర్చిస్తున్నారు.

మ‌యాంక్ అగ‌ర్వాల్ క్యాచ్ మిస్‌

పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ స‌మ‌యంలో జ‌స్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్లో ఆ జ‌ట్టు కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను ఎం. అశ్విన్ వ‌దిలేశాడు. ఆఫ్‌సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మురుగ‌న్ అశ్విన్ బంతిని అంచ‌నా వేయ‌డంలో లేట్ అవ‌డంతో క్యాచ్ మిస్స‌య్యాడు. అప్ప‌టికీ మ‌యాంగ్ పెద‌గా స్కోర్ చేయ‌లేదు.

దీంతో ఆ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకున్న మ‌యాంక్ అగ‌ర్వాల్ మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌తో కలిసి తొలి వికెట్‌గా భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. అలాగే పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. దీంతో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మికి ఇది మొద‌టి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రోహిత్ శ‌ర్మ విఫ‌లం

ముంబై ఇండియ‌న్స్ ఓట‌మికి ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్‌లో విఫ‌ల‌మ‌వ‌డం రెండో కార‌ణంగా చెప్పువ‌చ్చ‌ని అభిమానులు అంటున్నారు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే బౌండ‌రీలు, సిక్సులు బాది మంచి ట‌చ్‌లో క‌నిపించిన రోహిత్ శ‌ర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాతాడ‌ని భావించిన‌ప్ప‌టికీ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. 28 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు.

దీంతో ఆ జ‌ట్టుకు మంచి ఓపెనింగ్ భాగ‌స్వామ్యం ల‌భించ‌లేదు. మ‌రో ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ కూడా 3 ప‌రుగుల‌కే ఔట‌వ‌డం మ‌రింత కొంప‌ముంచింది. నిజానికి ఈ సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ రాణించ‌క‌పోవ‌డం కూడా ఆ జ‌ట్టు వ‌ర‌స ప‌రాజ‌యాల‌కు కార‌ణ‌మ‌వుతుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హిట్‌మ్యానే ఒప్పుకున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ చివ‌రి 13 ఇన్నింగ్స్‌ల్లో ఒక హాఫ్ సెంచ‌రీ కూడా చేయ‌లేదంటేనే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్

13వ ఓవ‌ర్లో అన‌వ‌స‌ర‌మైన ప‌రుగుకు ప్ర‌య‌త్నించి తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్ అవ‌డం ముంబై ఇండియ‌న్స్ ఓట‌మికి మూడో కార‌ణంగా క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. అప్ప‌టికీ 3 ఫోర్లు, 2 సిక్సుల‌తో 20 బంతుల్లోనే 36 ప‌రుగులు బాదిన తిల‌క్ వ‌ర్మ క్రీజులో చ‌క్క‌గా కుదురుకున్నాడు. కానీ సూర్య‌కుమార్ యాద‌వ్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న తిల‌క్ స‌రిగ్గా చూసుకోకుండా ప‌రుగుకు ప‌రిగెత్తాడు. సూర్య వెన‌క్కి పంపించిన‌ప్ప‌టికీ అప్ప‌టికే మయాంక్ అగ‌ర్వాల్ విసిరిన త్రోను అందుకున్న అర్ష్‌దీప్ సింగ్ వికెట్ల‌ను కొట్టాడు.

పొలార్డు ర‌నౌట్‌

ఇక ముంబై ఇండియ‌న్స్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచిన నాల్గో అంశం ఆ జ‌ట్టు బిగ్ హిట్ట‌ర్ కీర‌న్ పొలార్డు ర‌నౌట్ అవ‌డ‌మేన‌ని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. 17వ ఓవ‌ర్లో సూర్య‌కుమార్ యాద‌వ్, కీర‌న్ పొలార్డ్ మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం నెల‌కొంది. ఆ ఓవ‌ర్ తొలి బంతికి సింగిల్ తీసిన పొలార్డు రెండో ప‌రుగుకు ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. కానీ అనూహ్యంగా అక్క‌డ రెండో ప‌రుగు వ‌చ్చే అవ‌కాశం లేన‌ప్ప‌టికీ పొలార్డును పిలుస్తూ సూర్య‌కుమార్ యాద‌వ్ ప‌రిగెత్తాడు.

దీంతో పొలార్డు కూడా రెండో ర‌న్‌కు వెళ్లాడు. ఈ త‌ప్పుడున్న ఉప్ప‌యోగించుకున్న పంజాబ్ ఫీల్డ‌ర్లు ఓడియ‌న్ స్మిత్, జితేష్ శ‌ర్మ క‌లిసి పొలార్డును ర‌నౌట్ చేశాడు. అక్క‌డ రెండో ప‌రుగు వ‌చ్చే అవ‌కాశం లేద‌నే పొలార్డు సింగిల్‌ను నిదానంగా తీశాడు. కానీ సూర్య స‌రిగ్గా చూసుకోకుండా రెండో ప‌రుగుకు పిల‌వ‌డంతో అన‌వ‌రంగా వెళ్లి ర‌నౌట్ అయ్యాడు. దీంతో ఈ ర‌నౌట్ ముంబై ఇండియ‌న్స్ ఓట‌మిలో కీల‌క పాత్ర పోషించింది. అలాగే సూర్య‌కుమార్ యాద‌వ్.. పొలార్డు ర‌నౌట్‌కు కార‌ణ‌మ‌య్యాడు. మొత్తానికి ఈ కార‌ణాల‌తో ముంబై మ‌రోసారి ఓడింది.

Story first published: Thursday, April 14, 2022, 7:32 [IST]
Other articles published on Apr 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+