MI VS LSG: ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ మొన్నటివరకు పరుగులు చేయడానికి ఎంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఈ సీజన్ లో ఒక మ్యాచుకు బెంచ్ కే పరిమితమయ్యాడు. ఆడిన 9 మ్యాచుల్లో 240 పరుగులు చేశాడు. మొదటి ఆరు మ్యాచుల్లో అతడు చేసిన పరుగులు 82 మాత్రమే. కానీ రీసెంట్ గా గత రెండు మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీల బాది మళ్లీ ఫామ్ లో వచ్చాడు. 76*, 70 పరుగుల సాధించాడు. అది కూడా ఛేదనలో. దీంతో ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులోనూ అతడిపై భారీ అంచనాలను ఏర్పడ్డాయి
అందుకు తగ్గట్టే రోహిత్ శర్మ.. లక్నో మ్యాచులో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్ లో 2.1 ఓవర్ దగ్గర తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్ బాది ఖాతా తెరిచాడు. తర్వాత బంతిని కూడా సిక్సుగా మలిచాడు. అలా వరుసగా రెండు బంతులకు రెండు సిక్సులు కొట్టాడు. దీంతో రోహిత్ అభిమానులు తెగ సంబరపడిపోయాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.
మయాంక్ యాదవ్ బౌలింగ్ లోనే అదే ఓవర్ లోనే 2.5 ఓవర్ దగ్గర వికెట్లకు దూరంగా వెళ్తోన్న బంతిని వెంటాడి మరి అనవసర షాట్ కు ప్రయత్నించి.. పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. రోహిత్ ఇచ్చిన క్యాచును ప్రిన్స్ యాదవ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. దీంతో 33 పరుగులు వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది ముంబై జట్టు. మొత్తంగా 5 బంతుల్లో 240 స్ట్రైక్ రేటుతో 2 సిక్సులు బాది 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
దీంతో రోహిత్ అభిమానులు కాస్త నిరాశపడినప్పటికీ.. క్రికెట్ ఫ్యాన్స్ మయాంక్ యాదవ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి అతడు గాయం కారణంగా ఇప్పటి వరకు మ్యాచులు దూరంగా ఉన్నాడు. తాజా మ్యాచుతోనే రీఎంట్రీ ఇచ్చిన ఈ పేస్ సెన్సేషన్.. వచ్చీ రాగానే తొలి ఓవర్ లో కాస్త తడబడ్డాడు. మూడో ఓవర్ లో అతడి బౌలింగ్ లోనే రోహిత్ కూడా వరుస సిక్సులు బాది ఇన్నింగ్స్ షురూ చేశాడు. ఆ తర్వాత మయాంక్.. మూడు, నాలుగు షాట్ బాల్స్ వేయగా మిస్ చేశాడు రోహిత్. అనంతరం మయాంక్ యాదవ్.. అదే ఓవర్ లోనే ఐదో బంతికి రోహిత్ శర్మను తన స్లోయల్ షార్ట్ డెలివరీతో ఔట్ చేశాడు. 120 కి.మీ వేగంతో బౌలింగ్ వేసి రోహిత్ ను ఔట్ చేశాడు. దీంతో మయాంక్.. రోహిత్ పై అద్భుతంగా ప్రతీకారం తీర్చుకున్నాడని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
2 వికెట్లు తీసి.. 40 పరుగులు..
ఇకపోతే మయాంక్ యాదవ్ రీఎంట్రీలో 150 కి.మీ వేగం మార్క్ ను టచ్ చేస్తాడని అంతా ఆశించారు. కానీ అతడు ఈ మార్క్ ను టచ్ చేయలేదు. తొలి ఓవర్ లో అత్యధికంగా మూడో బంతికి 142.7 కి.మీ వేగంతో సంధించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్ లో తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు తీశాడు.
