For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI VS LSG: 'క్యా షాట్ రే' - ఒక్క మ్యాచులో 3 భారీ రికార్డులు బ్రేక్!

SuryaKumar Yadav: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా వాంఖెడె స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ముంబై జట్టు మళ్లీ భారీ స్కోరు చేయడంతో క్రికెట్ అభిమానుల్లో ఫుల్ జోష్ పెరిగింది.

తొలి భారత ప్లేయర్ గా రికార్డ్..
ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా ఐపీఎల్ లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్ గా నిలిచాడు. 145 ఇన్నింగ్సుల్లో 2,714 బంతుల్లోనే 4 వేల పరుగుల మార్కును అందుకున్నాడు సూర్యకుమార్. ఈ క్రమంలో సురేశ్ రైనా (2,881 బంతుల్లో) రికార్డును అధిగమించాడు. మొత్తంగా అగ్రస్థానంలో డివిలియర్స్, గేల్ (2,658) ఉన్నారు. ఆ తర్వాత వార్నర్ (2,809) కొనసాగుతున్నాడు. అలానే పరుగుల పరంగా ఐపీఎల్ లో 4 వేల పరుగులు సాధించిన 17వ ప్లేయర్ గా నిలిచాడు.

ముంబై తరఫున రెండో ఆటగాడిగా..
అలానే ఐపీఎల్ లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కీరన్ పొలార్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ - 5698 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ - 3413 రన్స్, కీరన్ పొలార్డ్ - 3412 పరుగులు, అంబటి రాయుడు - 2416 పరుగులు, సచిన్ టెండుల్కర్ - 2334 రన్స్ చేశారు.

ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం..
ఇంకా ఈ ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ రేసులో 10 మ్యాచుల్లో 427 పరుగులు మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (జీటీ) - 417 పరుగులు, కోహ్లీ (ఆర్సీబీ) - 392 పరుగులు, నికోలస్ పూరన్ (లక్నో) - 377 పరుగులు, జోస్ బట్లర్ (జీటీ) - 356 రన్స్ చేశారు.

ఆ ఇద్దరూ ఊచకోత..
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టులో ఓపెనర్‌ ర్యాన్ రికెల్‌టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇర ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే సిక్స్‌లుగా మలిచి, మంచి ఊపుమీద కనిపించిన రోహిత్‌ శర్మ ఐదో బంతికే పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో 12 పరుగులు చేసి త్వరగానే క్రీజును వదిలాడు. విల్ జాక్స్‌ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్య (5) నిరాశపరిచారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 25*), కోర్బిన్ బాష్‌ (10 బంతుల్లో 20) కాస్త మెరుపులు మెరిపించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, అవేశ్‌ ఖాన్ 2, దిగ్వేశ్‌ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

MI VS LSG IPL 2025 SuryaKumar Yadav becomes second fastest batter to score 4000 runs by balls
Story first published: Sunday, April 27, 2025, 18:22 [IST]
Other articles published on Apr 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+