Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI VS LSG: బుమ్రా బ్రహ్మాస్త్ర - లసిత్ మలింగ రికార్డ్ బ్రేక్

MI Highest wicket taker Bumrah: భారత ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నైపుణ్యాలు అసామాన్యమైనవని అన్న సంగతి తెలిసిందే. బుమ్రాను ఎన్నిసార్లు ఎదుర్కొన్నా.. మళ్లీ అతడి బౌలింగ్‌కు అలవాటు పడడానికి సమయం పడుతుందని బ్యాటర్లు కూడా చెబుతుంటారు. ఎందుకంటే అంతలా బుమ్రా.. తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తుంటాడు. అయితే తాజాగా ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచులో బుమ్రా అదిరే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే..

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లను ముంబై బౌలర్లు బానే కట్టడి చేశారు. ముఖ్యంగా బుమ్ బుమ్ బుమ్రా ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అయిడెన్ మరక్రమ్ వికెట్ తీసిన బుమ్రా.. అదిరే ఘనత సాధించాడు.

MI VS LSG IPL 2025 Bumrah becomes Mumbai indians Highest wicket taker with 171 scalps

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు బుమ్రా. అలానే దిగ్గజ క్రికెటర్ లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకుముందు 170 వికెట్లతో మలింగతో సమంగా ఉన్న బుమ్రా.. తాజా మ్యాచులో 171 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మలింగ 170 వికెట్లను 122 మ్యాచుల్లో19.79 సగటుతో, 7.14 ఎకానమీతో తీశాడు. బుమ్రా 139 మ్యాచుల్లో 7.31 ఎకానమీ రేటు, 9.79 సగటుతో 171 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ముంబై తరఫున బుమ్రా బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 5/10. 2022లో కేకేఆర్ పై ఈ ప్రదర్శన చేశాడు. కానీ ఈ మ్యాచులో ముంబై 52 పరుగులు తేడాతో ఓడింది.

ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
బుమ్రా - 177 వికెట్లు, లసిన్ మలింగ - 170 వికెట్లు, హర్భజన్ సింగ్ - 127 వికెట్లు, మిచెల్ మెక్ క్లెనాఘాన్ - 71 వికెట్లు, కీరన్ పొలార్డ్ - 69 వికెట్లు, హార్దిక్ పాండ్య - 65 వికెట్లు తీశారు.

Story first published: Sunday, April 27, 2025, 19:08 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+