Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI VS LSG: ముంబై వరుసగా ఐదో విజయం - ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..

MI VS LSG: ఐపీఎల్ 2025లో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. బ్యాటుతో బంతితో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగులు తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ లో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇది 150వ విక్టరీ కావడం విశేషం. తాజా మ్యాచు విజయంలో రికెల్టన్ (58), సూర్యకుమార్ యాదవ్ (54), బుమ్రా 4 వికెట్లు కీలకంగా వ్యవహరించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్.

216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ లో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆయుస్ బదోని (35; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (27; 15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (24) పరుగులు చేశారు. మంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లతో (4/22) అదరగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ (3/20) , విల్ జాక్స్ 2, కోర్బిన్ బోచ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. లక్నోకు 10 మ్యాచ్‌ల్లో ఇది ఐదో ఓటమి.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో ఓపెనర్‌ ర్యాన్ రికెల్‌టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇర ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే సిక్స్‌లుగా మలిచి, మంచి ఊపుమీద కనిపించిన రోహిత్‌ శర్మ ఐదో బంతికే పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో 12 పరుగులు చేసి త్వరగానే క్రీజును వదిలాడు. విల్ జాక్స్‌ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్య (5) నిరాశపరిచారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 25*), కోర్బిన్ బాష్‌ (10 బంతుల్లో 20) కాస్త మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది ముంబై. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, అవేశ్‌ ఖాన్ 2, దిగ్వేశ్‌ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

MI VS LSG IPL 2025 Bumrah 4 wickets helps Mumbai Indians won against Lucknow Super Giants

ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు..
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడీ జట్టు ఖాతాలో 12 పాయింట్లు(10 మ్యాచులు) ఉన్నాయి. నెట్ రన్ రేట్ 0.889 ఉంది. కాబట్టి నెక్ట్స్ ఆడబోయే నాలుగు మ్యాచుల్లో కనీసం రెండు గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించినట్టే.

Story first published: Sunday, April 27, 2025, 19:31 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+