Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: దంచికొట్టిన వెంకటేష్, త్రిపాఠి.. ముంబైపై కోల్‌కతా సునాయాస విజయం!!

MI vs KKR: Venkatesh Iyer, Rahul Tripathi helps Kolkata beat Mumbai, KKR jump to 4th spot

అబుదాబి: ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌ సునాయాస విజయాన్ని అందుకుంది. ముంబై నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మ‌న్ గిల్ (13) విఫలమయినా మరో ఓపెనర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ (53; 30 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రాహుల్ త్రిపాఠి (74; 42 బంతుల్లో 8x4, 3x6) దంచికొట్టాడు. అయ్య‌ర్, త్రిపాఠిల భాగస్వామ్యంతో కోల్‌కతా అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు.

శుభారంభం:

156 పరుగుల లక్ష్య ఛేదనని కోల్‌కతా ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో శుభమన్ గిల్ (13: 9 బంతుల్లో 1x4, 1x6), వెంకటేశ్ అయ్యర్ (53) చెరో సిక్స్ బాదేశారు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, ఆడమ్ మిల్నేకీ ఇద్దరు బౌండరీలతో స్వాగతం పలికారు. అయితే టీమ్ స్కోరు 40 వద్ద గిల్‌ని బుమ్రా ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన రాహుల్ త్రిపాఠి భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని బౌండరీల మోత మోగించాడు. దాంతో 9-10 ఓవర్లు ముగిసే సమయానికే ముంబై ఓటమి ఖరారు అయింది.

అయ్యర్ అదరహో:

కెరీర్‌లో రెండో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న వెంకటేష్ అయ్యర్ కూడా భారీ షాట్లు ఆడుతూ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతడికి ఈ టోర్నీలో ఇదే మొదటిది. అయితే అయ్యర్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7)ని జస్ప్రీత్ బుమ్రా వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. కానీ అప్పటికే ముంబైకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నితీష్ రాణా బౌండరీతో కోల్‌కతాకు విజయం అందించాడు. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసి ముంబై ఆరో స్థానానికి పడిపోయింది. మరోవైపు కోల్‌కతా వరుస విజయాలతో అట్టడుగు నుంచి ఒక్కోస్థానాన్ని మెరుగుపరుచుకుంటూ ముంబైనే దాటి టాప్‌ 4లోకి దూసుకొచ్చింది.

మంచి ఆరంభం:

మంచి ఆరంభం:

అంతకుముందు టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33; 30 బంతుల్లో 4x4), క్వింటన్ డికాక్‌ (55; 42 బంతుల్లో 4x4, 3x6) వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. గత మ్యాచుకు దూరమైన రోహిత్ తనదైన శైలిలో కాకుండా.. కాస్త ఆచితూచి ఆడాడు. సిక్సులకు పోకుండా కాస్త నెమ్మదిగా ఆడాడు. అయితే డికాక్‌ మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ముంబై ఓపెనర్లు తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఇక వేగం పెంచే క్రమంలో రోహిత్‌ భారీ షాట్‌కు యత్నించి మిస్టరీ స్పిన్నర్ సునిల్‌ నరైన్ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ చేతికి చిక్కాడు. దీంతో ముంబై మొదటి వికెట్ కోల్పోయింది.

డికాక్‌ హాఫ్ సెంచరీ:

డికాక్‌ హాఫ్ సెంచరీ:

అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (5) విఫలమయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ అండతో క్వింటన్ డికాక్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 50 ప‌రుగులు చేశాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన డికాక్‌ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్‌కు చేర్చాడు. ఆపై ఇషాన్‌ కిషన్‌ (14), కృనాల్ పాండ్యా (12) త్వరగానే ఔట్ అయ్యారు. హిట్టర్ కీరన్‌ పొలార్డ్‌ (21; 15 బంతుల్లో 2x4, 1x6) ఫర్వాలేదనిపించినా.. దూకుడుగా మాత్రం ఆడలేకపోయాడు. కీలక సమయంలో ఔట్ అయి నిరాశపరిచాడు. దీంతో ముంబై సాధారణ స్కోరుకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా.. సునిల్‌ నరైన్ ఒక వికెట్‌ తీశారు. వరుణ్ చక్రవర్తి వికెట్ తీయకున్నా.. పరుగులు మాత్రం ఇవ్వలేదు.

Story first published: Thursday, September 23, 2021, 23:36 [IST]
Other articles published on Sep 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+