Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ!

MI vs KKR: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు

టాస్ గెలిచిన అనంతరం కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. "మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. మా తదుపరి రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడమే మా లక్ష్యం. టోర్నమెంట్ మొదటి భాగంలో కొన్ని కీలక క్షణాల్లో మేము అవకాశాలను చేజార్చుకున్నాం, లేదంటే మా పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది. ఈ పిచ్‌ను అంచనా వేయడం కాస్త కష్టంగా ఉంది, కాబట్టి మేము మొత్తం 40 ఓవర్ల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మేము ఎటువంటి మార్పులు లేకుండా పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం" అని రహానే స్పష్టం చేశాడు.

MI vs KKR Toss Update KKR Opt to Bowl First as Hardik Pandya Returns for Mumbai Indians

మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "టాస్ గెలిస్తే మేము కూడా మొదట బౌలింగే ఎంచుకునేవాళ్లం. పిచ్ చాలా సేపు కవర్ల కింద ఉన్నట్లు కనిపిస్తోంది, కాబట్టి ఇది ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలనే బరిలోకి దిగుతాము. మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. ముంబై ఇండియన్స్ జట్టుకు టైటిళ్లు గెలిచిన గొప్ప చరిత్ర ఉంది. కాబట్టి మేము తల ఎత్తుకుని నిలబడేలా, ముంబై ఇండియన్స్‌కు అత్యుత్తమ ప్రాతినిధ్యం వహించేలా ఆడతాము" అని చెప్పుకొచ్చాడు.

తుది జట్లు ఇవే:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్య రహానె(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే

Story first published: Wednesday, May 20, 2026, 19:21 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+