ముంబై టీంలో సూర్యకుమార్ ఔట్, కేకేఆర్ టీంలో 5 మార్పులు.. టాస్ గెలిచి బౌలింగ్‌తో ముంబై రెఢీ

ఐపీఎల్-2022 సీజన్‌లో వరుసగా 8 పరాజయాలు చవిచూసిన ముంబై జట్టు ఇక గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా గెలిచి విజయాల బాట పట్టింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం రాత్రి 7.30గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన తర్వాత ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
ఈ క్రమంలోనే వరుస విజయాలు సాధించి గౌరవప్రదంగా టోర్నీని ముంగించాలనే లక్ష్యంతో ఉంది. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ గనుక ఓడిపోతే.. టోర్నీ ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగిన రెండో జట్టు అవుతుంది. ఇప్పటికే టోర్నీలో నాలుగు జట్లు 14పాయింట్లతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేకేఆర్ 11 మ్యాచ్‌లలో 4మ్యాచ్‌లు గెలిచి 8పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుండగా, ముంబై 10 మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు గెలిచి 4పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

టాస్ గెలిచిన రోహిత్ శర్మ మాట్లాడుతూ..
ఈ క్రమంలో ఈ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ విషయమై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బౌలింగ్ ఎంచుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏం లేదన్నాడు. ఏదేమైనా ఈ సీజన్లో మేం చాలా ఒడిదొడుకులు తిన్నాం. ఇక ముందున్న ప్రతి మ్యాచ్ కూడా మాకో అవకాశం లాంటిదిగానే భావిస్తాం. సూర్యకుమార్ యాదవ్ ఇంజూర్ అవడంతో అతని ప్లేస్‌లో రమన్‌దీప్ సింగ్‌ను తీసుకున్నాం.

భారీ మార్పులతో కేకేఆర్ బరిలోకి
టాస్ ఓడిన శ్రేయస్ అయ్యార్ మాట్లాడుతూ.. నేను టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలని చూశాను. ఎందుకంటే వికెట్ కాస్త గ్రీనీగా కనిపిస్తుంది. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. మేము మంచి స్కోరును నమోదు చేయాల్సిన అవసరముంది. మాకు ప్రధాన సమస్య ఓపెనింగ్ భాగస్వామ్యం లేకపోవడం. దాన్ని అధిగమించాలని చూస్తున్నాం. ఇక ఈ మ్యాచ్‌లో మేం ఫ్రెష్ మైండ్‌తో బరిలోకి దిగుతున్నాం. ఇక మా జట్టులో మేము ఐదు మార్పులు చేశాము. అజింక్యా రహానే, ప్యాట్ కమిన్స్, వెంకటేష్ అయ్యార్, వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ టీంలోకి వచ్చారు.

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ 11): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యార్, శ్రేయస్ అయ్యార్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ 1I): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, రమన్‌దీప్ సింగ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications