Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ‌కు చెత్త రికార్డులు.. నేడైనా మారేనా?

MI vs KKR: Rohit Sharma vs Sunil Narine Head to Head Records in IPL

ఐపీఎల్ 2022లో నేడు కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. పుణే వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతున్నాయి. టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు విజయాన్ని న‌మోదు చేయ‌ని ముంబై ఇండియ‌న్స్ త‌న‌కు అచ్చొచ్చిన కోల్‌క‌తాపై గెలిచి తొలి విజ‌యాన్ని న‌మోదు చేయాలని ప‌ట్టుద‌ల‌గా ఉంది. అటు ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి స్థానానికి దూసుకుపోవాల‌ని కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్లులోని ప్ర‌ధాన ఆట‌గాళ్ల మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో గ‌తంలో రోహిత్ శ‌ర్మ వ‌ర్సెస్ సునీల్ న‌రైన్‌ల హెడ్ టూ హెడ్ రికార్డులు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

{cricket_4-2022_53623}

సునీల్ న‌రైన్‌ (vs) రోహిత్ శ‌ర్మ‌

ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్‌పై ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు అంత మంచి రికార్డులు ఏమి లేవు. ఈ లీగ్‌లో న‌రైన్ బౌలింగ్‌లో 135 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ కేవ‌లం 104 స్ట్రైక్‌రేట్‌తో 141 ప‌రుగులే చేశాడు. ఏకంగా 8 సార్లు న‌రైన్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ ఔట‌య్యాడు. స‌గ‌టు 17 మాత్ర‌మే ఉంది. న‌రైన్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ 15 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. 55 డాట్ బాల్స్ కూడా ఉన్నాయి. దీంతో నేడు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో చెల‌రేగి రోహిత్ శ‌ర్మ త‌న రికార్డుల‌ను మెరుగుప‌ర‌చుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ముంబై ఇండియ‌న్స్ పూర్తి జ‌ట్టు

ముంబై ఇండియ‌న్స్ పూర్తి జ‌ట్టు

ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఫాబియన్ అలెన్, సంజయ్ యాదవ్, రిలే మెరెడిత్, రమణదీప్ సింగ్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయల్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, రాహుల్ బుద్ధి, అర్షద్ ఖాన్, డెవాల్డ్ బ్రీవిస్

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ పూర్తి జ‌ట్టు

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ పూర్తి జ‌ట్టు

అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ నబీ, పాట్ కమిన్స్, షెల్డన్ జాక్సన్, చామికా కరుణరత్నే, బాబా ఇంద్రజిత్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, ప్రథమ్ సింగ్, అభిజీత్ తోమర్, రసిఖ్ సలామ్, అమన్ హకీమ్ ఖాన్, అశోక్ శర్మ, రమేష్ కుమార్

Story first published: Wednesday, April 6, 2022, 17:56 [IST]
Other articles published on Apr 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+