MI vs KKR: రోహిత్ శర్మ ప్రత్యేక మైలురాయి.. తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!!

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో భాగంగా అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముంబై ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ కాస్త ఆచితూచి ఆడగా.. డికాక్ దూకుడుగా ఆడాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించింది. 10వ ఓవర్ రెండో బంతికి సునీల్ నరైన్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ అయ్యాడు. రోహిత్ 30 బంతుల్లో 4 బౌండరీలతో 33 పరుగులు చేశాడు.

తొలి క్రికెటర్‌గా రికార్డు:
ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్థి జట్టుపై 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరుణ్ చక్రవర్తి వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడంతో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ మ్యాచుకు ముందు కోల్‌కతాపై హిట్‌మ్యాన్ 982 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. పంజాబ్ కింగ్స్‌పై 943 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. వార్నర్ కోల్‌కతాపై కూడా 915 రన్స్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 909 (ఢిల్లీ క్యాపిటల్స్) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

అత్యధిక సార్లు ఓ బౌలర్ చేతిలో:
ఐపీఎల్లో అత్యధిక సార్లు ఓ బౌలర్ చేతిలో ఔట్ అయిన జాబితాలో ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. జహీర్ ఖాన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఐపీఎల్లో 7సార్లు ఔట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని సందీప్ శర్మ 7 సార్లు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను సునీల్ నరైన్ 7 సార్లు ఔట్ చేశారు. ఈ మ్యాచులో రోహిత్ శర్మను నరైన్ ఔట్ చేశాడు. ఇక రోహిత్ మరో 2 సిక్సులు బాదితే టీ20ల్లో 400 సిక్సులు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. పవర్‌ప్లేలో మరో 2 సిక్సులు బాదితే ఐపీఎల్ పవర్ ప్లేలో 50 సిక్సులు సాధించిన తొలి ముంబై ఇండియన్స్ బ్యాటర్‌గా రోహిత్ మరో రికార్డు నెలకొల్పుతాడు.

మూడో స్థానానికి రోహిత్:
ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ జాబితాలో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మూడో స్థానానికి చేరుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో రోహిత్ 20 పరుగులు చేయగానే.. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. రైనా 5495 పరుగులతో నాలుగు స్థానానికి పడిపోయాడు. రోహిత్ 5509 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (6081), శిఖర్ ధావన్ (5619) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

డికాక్ హాఫ్ సెంచరీ:
ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో డికాక్ 50 పరుగులు తీశాడు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం డికాక్ ఔట్ అయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (5) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (13), కీరన్ పొలార్డ్ (0) ఉన్నారు. 15 ఓవర్లకు ముంబై మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications