For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్ ‘కత్తి’ లాంటి విజయం.. చేతులెత్తేసిన ముంబై

MI vs KKR : Kolkata won by 52runs over Mumbai

ఐపీఎల్-2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్‌‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 166పరుగుల టార్గెట్ ఛేదనలో పూర్తిగా తడబడింది. ఇక 17.3ఓవర్లలో 113పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 52పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ రేసులో ఇంకా కొనసాగుతోంది.

 ఆదిలోనే ఎదురు దెబ్బ, చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏదీ?

ఆదిలోనే ఎదురు దెబ్బ, చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏదీ?

ఛేజింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్‌కు సౌథీ వేసిన తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (2) వివాదాస్పదరీతిలో కీపర్ క్యాచ్ ఔటయిపోయాడు. ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (51పరుగులు 43బంతుల్లో 5ఫోర్లు 1సిక్సర్) మాత్రం ఛేజింగ్ దిశగా ఇన్నింగ్స్ నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ మరో ఎండ్‌లో ముంబై బ్యాటర్లెవరు అతనికి సహకరించలేదు. తిలక్ వర్మ (6), రమన్ దీప్ సింగ్ (12), టిమ్ డేవిడ్ (13), కీరన్ పొలార్డ్ (15) ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోవడం ముంబై కొంపముంచింది. ఇక చివర్లో మ్యాజిక్ చేస్తాడనుకున్న కీరన్ పొలార్డ్ రనౌట్ కావడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి.

 నిప్పులు చెరిగిన కోల్ కతా బౌలర్లు

నిప్పులు చెరిగిన కోల్ కతా బౌలర్లు

ఇక కోల్‌కతా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ముంబై బ్యాటర్లను వణికించారు. అనవసర హిట్టింగ్‌తో ముంబై బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. కోల్ కతా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 3, సౌథీ 1, ఆండ్రీ రస్సెల్ 2, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసి ముంబై పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్‌లో విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ 7వ స్థానానికి చేరుకుంది. ఇంకా తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఎప్పటిలాగే తన అట్టడుగు స్థానంలో మరింత స్థిరపడింది.

అంతకుముందు రాణించిన కోల్‌కతా టాపార్డర్

అంతకుముందు రాణించిన కోల్‌కతా టాపార్డర్

అంతకుముందు కోల్‌కతాకు అద్భుతమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యార్ (43పరుగులు 24బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు), అజింక్యా రహానే (25పరుగులు 24బంతుల్లో) రాణించగా.. నితీష్ రాణా (43పరుగులు 26బంతుల్లో 3ఫోర్లు 4సిక్సర్లు) చెలరేగి ఆడాడు. ఒకానొక దశలో 200పరుగుల స్కోరు దాటుతుందనిపించిన దశలో ముంబై బౌలర్ జస్పీత్ బుమ్రా 4-1-10-5ప్రదర్శనతో తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ చేసి కోల్‌కతా స్కోరుబోర్డుకు కళ్లెం వేశాడు. బుమ్రా 5, కుమార్ కార్తికేయ 2, డానియల్ సామ్స్ 1, మురుగన్ అశ్విన్ 1 వికెట్లు తీశారు.

పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అవార్డులు

పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అవార్డులు

సూపర్ స్ట్రైకర్ - వెంకటేష్ అయ్యర్

గేమ్ ఛేంజర్ - జస్ప్రీత్ బుమ్రా

లెట్స్ క్రాకింగ్ సిక్సెస్ - వెంకటేష్ అయ్యర్

పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - వెంకటేష్ అయ్యర్

మోస్ట్ వాల్యుబుల్ అసెట్ - వెంకటేష్ అయ్యర్

ఆన్ ది గోఫోర్స్ - ఇషాన్ కిషన్

ఫాస్టెస్ట్ డెలివరీ - జస్ప్రీత్ బుమ్రా

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ - జస్ప్రీత్ బుమ్రా

తుది జట్లు

తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ 11): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యార్, శ్రేయస్ అయ్యార్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ 1I): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, రమన్‌దీప్ సింగ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

Story first published: Monday, May 9, 2022, 23:47 [IST]
Other articles published on May 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+