MI vs KKR: కొంపముంచిన స్టార్స్.. ముంబైపై కేకేఆర్ ఘన విజయం
MI vs KKR: ఐపీఎల్ 2026 సీజన్ 65వ మ్యాచ్‌లో కేకేఆర్ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో బుధవారం రాత్రి (మే 20, 2026) జరిగిన ఈ కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా అల్లాడించి.. తన నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో కేకేఆర్ ఖాతాలో 13 పాయింట్లు చేరాయి.
టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆరంభంలోనే కోల్‌కతా బౌలర్లు షాకిచ్చారు. కేవలం 41 పరుగులకే ముంబై 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6), రోహిత్ శర్మ (15), నమన్ ధీర్ (0), సూర్యకుమార్ యాదవ్ (15)లు తక్కువ స్కోరుకే వెనుతిరిగారు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా (26), తిలక్ వర్మ (20) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. విల్ జాక్స్ (14) రనౌట్ అయ్యాడు. అయిత, ఆఖర్లో కార్బిన్ బాష్ (18 బంతుల్లో 32 నాటౌట్), దీపక్ చాహర్ (10) మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి, కెమరూన్ గ్రీన్ తలో 2 వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 13 రన్స్ ఇచ్చి హార్దిక్ పాండ్యా వికెట్ పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.

అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ ఫిన్ అలెన్ (8) దీపక్ చాహర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానే (21) కార్బిన్ బాష్ బౌలింగ్‌లో ఔట్ కాగా, అదే బాష్ తన తర్వాతి ఓవర్లో కెమరూన్ గ్రీన్‌ను కూడా అవుట్ చేసి కేకేఆర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే, మిడిల్ ఆర్డర్‌లో సీనియర్ బ్యాటర్ మనీష్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయానికి చేరవ చేశారు. మ్యాచ్ ముగిసే సమయానికి తేజస్వీ సింగ్ (11) ఔట్ అయినప్పటికీ.. అనుకుల్ రాయ్, రింకూ సింగ్ క్రీజులో ఉండి మరో 7 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications